రైతులను ఆదుకోవాలంటూ సినిమా డైలాగుల్లాంటి మాటలు విసిరారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సిఎమ్ కు నేరుగా సవాలు చేయకుండా, చెప్పకుండా మధ్యలో కావాలని కొడాలి నాని ని లాగారు.
నిజానికి కొడాలి నాని కి పవన్ మధ్య అంత వైరం లేదు. కొడాలి టార్గెట్ ఎప్పుడూ చంద్రబాబే.మరి అలాంటిది కావాలని పవన్ ఇలా మాటలు విసరడం అన్నది ఆయనను క్లియర్ గా కార్నర్ లోకి తోసింది.
చంద్రబాబు కోసం, చంద్రబాబుకు వకాల్తా తీసుకున్నారు ఈ వకీల్ సాబ్ అని క్లారిటీ వచ్చేసింది. దాంతో ఆయన మాటుల బూమరాంగ్ అయ్యాయి.
ఆ సంగతి అలా వుంచితే రైతులను ప్రభుత్వం ఆదుకుంటూనే వుంది. ఆదుకుంటుంది కూడా. పవన్ నిర్మాతలను ఆదుకోవాల్సింది పవన్ మాత్రమే.
జమానా కాలంనాడు నిర్మాత ఎఎమ్ రత్నం దగ్గర అడ్వాన్స్ రూపంలో వడ్డీ లేని అప్పు లా డబ్బు తీసుకున్నారు. పద్దతి ప్రకారం ఆయనకు ముందు సినిమా చేయాలి. కానీ ఆయనను దిల్ రాజుకు సినిమా చేయడం ప్రారంభించారు.
ఈ రెండింటిలో ఏ సినిమా కూడా ఫినిష్ చేయకుండా మూడో సినిమాకు శ్రీకారం చుట్టారు. నిజానికి అంతకన్నా ముందుగా తీసుకున్న అడ్వాన్స్ మైత్రీ వాళ్లది. అదీ అలాగే వుంది.
నిర్మాతలు అడ్వాన్స్ లు వాళ్ల ఇళ్లలోంచి తీసుకురారు. ఫైనాన్స్ పట్టుకొస్తారు. అంటే ఎంత ఆలస్యం అయితే అంతకు అంతా వడ్డీలు పేరుకుంటూనే వుంటాయి. పవన్ మాత్రం రూపాయి వడ్డీ కట్టక్కర్లా.
తన చేతిలో వున్న సినిమాలు చకచకా ఫినిష్ చేయకుండా తొచినపుడు చేస్తూ, నిర్మాతలకు కక్కలేక మింగలేక అన్నట్లు వుండిపోయేలా చేస్తున్న పవన్ ముందుగా వాళ్లను ఆదుకొవాల్సి వుంది అనే కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
సంక్రాంతికి అనుకున్న వకీల్ సాబ్ ఏప్రిల్ 9 కి వెళ్లింది. ఇక క్రిష్ సినిమా ఎప్పడో తెలియదు. ఆపై ఎకె రీమేక్, ఆ తరువాత మైత్రీ. మధ్య మధ్యలో ఈ పొలిటికల్ వ్యవహారాలు. ఎదుటవాళ్లపై మాటల దాడి చేసే ముందు పవన్ లాంటి వాళ్లు తమ వ్యవహారాలు కూడా సమీక్షించుకోవాలేమో?
'వకీల్ సాబ్ కాదు.. నువ్వు షకీలా సాబ్'