శిఖర్ ధావన్.. మెల్లమెల్లగానే అంతర్జాతీయ క్రికెట్ లో రికార్డులను అందుకుంటున్న భారత క్రికెటర్. బీభత్సమైన స్టార్ డమ్ దక్కడం లేదు కానీ, గతంలో పలువురు భారత వన్డే ఆటగాళ్లు స్థాపించిన రికార్డులను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ఉన్నాడు.
ఇక ఐపీఎల్ లో కూడా సత్తా చూపుతూ, ఒక విలువైన ఆటగాడిగా మారాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో తనదైన ప్రత్యేకతను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో ధావన్ వ్యక్తిగత విషయాలను, అతడి ఇష్టాలను, ఆసక్తుల గురించి అతడు ఏం చెప్పాడంటే..
కార్లంటే క్రేజ్..
తనకు కార్లన్నా, వాటిని నడపడం అన్నా చాలా ఇష్టం అంటున్నాడు ధావన్. కార్లలో రోడ్ ట్రిప్స్ వేయడం అంటే ఇతడికి చాలా ఇష్టమట.
తొలి కార్ అదే..
2004లో ధావన్ కు తొలి కారు గిఫ్ట్ రూపంలో దక్కిందట. తన అంకుల్ ఒకరు బ్లాక్ హ్యుండాయ్ యాక్సెంట్ కారు ను బహుమతిగా ఇచ్చాడట. ప్రస్తుతం ధావన్ వద్ద బ్లాక్ మెర్సిడేజ్ బెన్స్ జీఎల్ఎస్ కారు ఉంది.
డ్రీమ్ కారు అదే..
కార్ల మీద మోజు మొదలయ్యాకా బెనెట్లే లేదా రోల్స్ రాయిస్ ను కలిగి ఉండటాన్ని డ్రీమ్ గా మార్చుకున్నాడట. ఈ రెండింటిలో ఏదో ఒకటి లేదా వీలైతే రెండింటినీ కొనాలనేది ధావన్ ప్రణాళిక.
బెస్ట్ డ్రైవ్ అనుభవం..
తన జీవితంలో కారులో సాగించిన డ్రైవ్స్ లో కొన్ని మధురానుభూతులున్నాయని చెప్పాడు ధావన్. అందులో ఒకటి ఫ్రెండ్స్ తో కలిసి అమృత్ సర్ వెళ్లడం, రోండోది తన భార్య అయేషాతో కలిసి డెహ్రాడూన్ వెళ్లడం.
ఆ రోడ్లు చాలా అద్భుతంగా ఉన్నాయని, అనేక అందమైన సీనరీలను చూసే అవకాశం ఉంటుందని ధావన్ తన అనుభవాన్ని చెప్పాడు. అన్నింటికి మించి స్నేహితులు, ప్రేమించే వాళ్లు ప్రయాణంలో మరింత ప్రత్యేకం అవుతారంటున్నాడు. వాళ్లతో ప్రయాణం ఎంతో సరదాగా, ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటుంది కదా అని ధావన్ అన్నాడు.
ఫేవరెట్ ఫిల్మ్ సీన్..
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ప్రాంచైజ్ సినిమాల్లోని సీన్లన్నీ ఇష్టమే అని ధావన్ చెప్పాడు. తన భార్యకు కూడా ఆటోమొబైల్స్ అంటే చాలా ఇష్టం అని, తాము తరచూ కార్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటామని చెప్పాడు. కొంతమంది ఫ్రెండ్స్ కు కూడా కార్లంటే ఆసక్తి అని, వారితో తన చర్చలు జరుగుతూ ఉంటాయన్నాడు.
కార్ కేర్ టిప్..
కారు జాగ్రత్త గురించి ప్రత్యేకమైన టిప్ ఏమీ లేదని, కారును రెగ్యులర్ సర్వీసింగ్ చేయించుకోవడం ముఖ్యమంటున్నాడు. అను పాటించే టిప్ అదే అన్నాడు. తన కార్లు తనకు చాలా ముఖ్యమని, తన బిజీ షెడ్యూల్ లో కూడా ఇంటికి వచ్చినప్పుడు వాటి గురించి జాగ్రత్తలు తీసుకుంటానంటున్నాడు.
కారుకు పెట్టిన పేరేంటి..
క్రికెట్ లో ధావన్ కు గబ్బర్ గా పేరు. షోలే సినిమాను అమితంగా అభిమానించే ఈ క్రికెటర్ ను గబ్బర్ అని పిలుస్తుంది క్రికెట్ ప్రపంచం. ఇక తన కారు విషయానికి వస్తేదానికి 'ధన్నో' అని పేరు పెట్టుకున్నాడట ధావన్. ఆ పేరు కూడా షోలే సినిమాలోని ఒక పాత్ర పేరు అని ధావన్ చెప్పాడు.