సోలో బ‌తుకు @ 8 కోట్లు

సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ సోలో బతుకే సో బెటరు. ఈ సినిమా  టోటల్ నెగిటివ్ రైట్స్ ను జీ 5/జీటీవీ కి విక్రయించేసారు. అయితే డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను వుంచుకుని…

సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ సోలో బతుకే సో బెటరు. ఈ సినిమా  టోటల్ నెగిటివ్ రైట్స్ ను జీ 5/జీటీవీ కి విక్రయించేసారు. అయితే డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను వుంచుకుని థియేటర్ రైట్స్ ను ఆ సంస్థ మళ్లీ విక్రయించేసేందుకు సిద్దపడింది. 

ఒక దశలో ఎపి-తెలంగాణ లో ఈ సినిమాను యాక్టివ్ గిల్డ్ ప్రొడ్యూసర్స్ లో డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు కొన్న కొందరు కలిసి ఈ సినిమా థియేటర్ రైట్స్ తీసుకుందాం అనుకున్నారు. కానీ తరువాత మళ్లీ ఆగింది.

ఆఖరికి యువి వంశీ అడుగు ముందుకు వేసారు. ఎనిమిది కోట్లకు ఆంధ్ర, నైజాం థియేటర్ హక్కులను తీసుకున్నారు. 12 కోట్ల దగ్గర ప్రారంభమైంది జీ 5 బేరం. కానీ యువి 8 కోట్ల దగ్గరే వుండిపోయారు. 

ఆఖరికి ఎనిమిది ఎన్ఆర్ఎ, ఇంకా వస్తే మరో రెండు కోట్లు రిటర్న్ అనే లెక్కన ఒప్పందం కుదుర్చుకోవాలని జి సంస్థ ప్రతినిధులు ప్రయత్నాలు, చర్చలు ఇంకా సాగిస్తున్నారు.

నైజాం, వైజాగ్ లో దిల్ రాజు, కృష్ణ లో వి-3, కర్నూలు, నెల్లూరు, గుంటూరుల్లో యువి పంపిణీ చేసే అవకాశం వుంది. ఈస్ట్, వెస్ట్ లు అమ్మేస్తారో? పంపిణీ చేయిస్తారో చూడాలి. క్రిస్మస్ కు విడుదలవుతున్న సోలో బతుకే సో బెటరు సినిమా సాయి ధరమ్ తేజ్ కు చాలా క్రూషియల్.

ప్రతి రోజూ పండగే లాంటి పెద్ద హిట్ తరువాత వస్తున్న సినిమా కాబట్టి ఆ మేరకు అంచనాలు వుంటాయి. ఇది కూడా హిట్ అయితే తేజ్ మార్కెట్ ఫిక్స్ అయిపోతుంది. నిజానికి కరోనా లేకుండా వుండి వుంటే ఈ సినిమాకు మంచి థియేటర్ రేటు పలికి వుండేది. 

అయితే నిర్మాతకు మాత్రం మంచి లాభాలు వచ్చాయి. ఒటిటికి గంపగుత్తగా ఇచ్చేయడం వల్ల మంచి  లాభాలు సంపాదించారు.

కేసిఆర్ పాలన జగన్ కు ఓ పాఠం