బ్లాక్ బస్టర్..సూపర్ డూపర్ హిట్..బాలయ్య కెరీర్ లో నైజాం లో హయ్యస్ట్ కలెక్షన్లు. ఓవర్ సీస్ లో నియర్లీ వన్ మిలియన్. మరి ఇంతకీ ఆంధ్ర పరిస్థితి ఏమిటి?
ట్రేడ్ వర్గాల బోగట్టా ప్రకారం ఫస్ట్ వీక్ దాటినా ఆంధ్రలో ఇంకా బ్రేక్ ఈవెన్ కు దూరంగానే వున్నారు బయ్యర్లంతా. విశాఖ, ఈస్ట్, వెస్ట్, గుంటూరు ఏరియాల్లో ఇంకా డబ్బులు రావాలి. బ్రేక్ ఈవెన్ అయిన తరువాత కమిషన్లు సంగతి. కృష్ణ లో అడ్వాన్స్ మీద రిలీజ్ చేసారు కాబట్టి నో ప్రోబ్లెమ్. నెల్లూరు ఓకె.
ఇక సీడెడ్ మాత్రం తెగించి 150 రూపాయలు యూనిఫారమ్ రేటు అమ్మారు కనుక సేఫ్ అయిపోయారు. ఆంధ్రలో కూడా ప్రభుత్వం డిసైడ్ చేసిన తక్కువ రేట్లు ఏమీ కాదు. 100 రూపాయల యూనిఫారమ్ రేటు నే అమ్మారు. చాలా చోట్ల బెనిఫిట్ షో లు కూడా వేసారు. బి అయినా సి సెంటర్ అయినా. ఇరవై ఏడుకోట్ల మేరకు ఆంధ్రలో మార్కెట్ చేసారు. ఇంకా మరో అయిదు కోట్ల వరకు అక్కడ రావాల్సి వుంది.
జీఎస్టీ ఇన్ వాయిస్ లు ఇస్తారు కనుక బ్రేక్ ఈవెన్ అయిపోతారు అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. విశాఖ-నైజాం కలిపి తీసుకున్నారు కనుక, అక్కడ ఓ కోటి డెఫిసిట్ వున్నా, నైజాంలో సెట్ చేసుకుంటారు అని చెబుతున్నారు.
కానీ ఒకటే పాయింట్. ఇంత బ్లాక్ బస్టర్. బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అన్న సినిమా ఆంధ్ర లో బ్రేక్ ఈవెన్ కాకపోవడం ఏమిటో? తక్కువ రేట్లు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే 100 రూపాయల యూనిఫారమ్ రేటే అమ్మారు కదా., ఎటొచ్చీ తొలి మూడు రోజులు 200 లేదా 250 అమ్మడానికి కుదరలేదు. అప్పటికీ కొన్ని చోట్లు బెనిఫిట్ షో లు కూడా వేసారు.
ఇక మరో రెండు రోజుల్లో పుష్ప విడుదలవుతోంది. ఆపైన శ్యామ్ సింగరాయ్ వస్తోంది. అందువల్ల వీకెండ్ ల్లో కొంచెం ఏమైనా రావాలి తప్ప, మరీ ఎక్కువగా ఆశలు పెట్టుకోవడానికి లేదు కూడా.