ఎల్టీటీఈ ఉగ్రవాదుల స్టైల్ లో టీడీపీ టెక్నిక్స్!

ఎల్టీటీఈ ఉగ్రవాదులకు ఒక ప్రత్యేకమైన అలవాటు ఉంటుంది. నిజానికి చాలా మంది ఉగ్రవాదులకు ఇలాంటి అలవాటు ఉంటుంది గానీ.. ఎల్టీటీఈ ఈ టెక్నిక్‌కు పేరు మోసింది. తమ తమ ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వర్తించడంలో ఖర్మకాలి…

ఎల్టీటీఈ ఉగ్రవాదులకు ఒక ప్రత్యేకమైన అలవాటు ఉంటుంది. నిజానికి చాలా మంది ఉగ్రవాదులకు ఇలాంటి అలవాటు ఉంటుంది గానీ.. ఎల్టీటీఈ ఈ టెక్నిక్‌కు పేరు మోసింది. తమ తమ ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వర్తించడంలో ఖర్మకాలి పోలీసులకు దొరికిపోతే గనుక.. తక్షణం వారు సైనైడ్ క్యాప్సూల్ మింగేస్తారు. 

తమ నుంచి పోలీసులకు తమ పోరాటానికి సంబంధించిన ఎలాంటి సమాచారం అందే అవకాశం లేకుండా.. సైనైడ్ కేప్సూల్ మింగేసి తమను తాము చంపేసుకుంటారు. ఇలాంటి ఉగ్రవాద టెక్నిక్కులు ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా ప్రవేశించాయా అనే అనుమానం కలుగుతోంది. అరాచకాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కిపోతే.. ఇలాంటి హైడ్రామా నడిపించడం ద్వారా.. సేఫ్ గా బయటపడాలనే వ్యూహాలతో సాగుతున్నట్టుగా కనిపిస్తోంది. 

తాజాగా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న తెలుగుదేశం నాయకులు.. పోలీసులకు చిక్కగానే ఆత్మహత్యకు యత్నించే ప్రయత్నం చేయడం గమనిస్తే అలాగే అనిపిస్తోంది.

నెల్లూరు కార్పొరేషన్ కు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలుగుదేశానికి చెందిన పార్లమెంటు బీసీ సెల్ అధ్యక్షుడు కప్పిర శ్రీనివాసులు రెండు డివిజన్లకు ఇన్చార్జి. అక్కడ ఆయన డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలు రావడంతో పోలీసులు ఆయనను స్టేషన్ కు పిలిపించారు. అరెస్టు కూడా జరగలేదు. ప్రశ్నించారు అంతే.

పోలీసులు తనను వేధిస్తున్నారంటూ.. కప్పిర శ్రీనివాసులు పోలీసు స్టేషన్లోనే నిద్ర మాత్రలు మింగేసి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్పృహ తప్పడంతో ఆయనను అక్కడినుంచి ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

ఇదీ సంఘటన! ఈ సంఘటనను కాస్త లోతుగా గమనిస్తే తెలుగుదేశం నాయకులు ఎంతగా తెలివిమీరిపోయారో అర్థమవుతోంది. డబ్బులు పంచుతుండగా.. స్టేషనుకు పిలిపించినందుకే ఇంత పెద్ద రాద్ధాంతం చేశారు. నిద్రమాత్రలు మింగి చిన్న హైడ్రామా నడిపించడం ద్వారా.. డబ్బు పంపకాల గురించి పోలీసులు లోతుగా ప్రశ్నించడానికి, అవకాశం లేకుండా కాపాడుకున్నారు.

అచ్చంగా ఉగ్రవాదుల టెక్నిక్ కూడా అదే. సైనైడ్ కేప్సూల్ మిగడం ద్వారా.. తమ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఏ సమాచారం కూడా తమ ద్వారా పోలీసులకు దొరకకుండా చూసుకుంటారు. కాకపోతే అందుకోసం తమ ప్రాణాలనే బలి యిస్తారు. టీడీపీ నాయకులు ప్రాణాలు తీసుకునేంత అమాయకులు కాదు. ఏదో నాలుగు నిద్ర మాత్రలు మింగి.. స్పృహ తప్పుతున్న రూపేణా హైడ్రామా నడిపించి.. అప్పటికి బయటపడతారు.

కాకపోతే.. ఉగ్రవాదుల్లాగా కాకుండా.. టీడీపీ వాళ్లకి ఇంకో ఎడ్వాంటేజీ ఉంది. తమ తప్పులు దొరికిపోకుండా ఆపద నుంచి బయటపడడం మాత్రమే కాదు. తమను వేధిస్తున్నారంటూ.. పోలీసుల మీద ప్రభుత్వం మీద ఎదురుదాడికి దిగవచ్చు. అలా కూడా మైలేజీ సాధించవచ్చు!!