త్రివిక్రమ్-రానా-హిరణ్యకశ్యప..ఎప్పుడు?

హీరో రానా తో దర్శకుడు గుణశేఖర్ తలపెట్టిన సినిమా హిరణ్యకశ్యప. సురేష్ బ్యానర్ నిర్మాత. అయితే ఈ ప్రాజెక్టు చేతులు మారుతోంది. ఈ మేరకు నిర్మాత సురేష్ బాబు క్లారిటీ ఇచ్చేసారు. మరో పెద్ద…

హీరో రానా తో దర్శకుడు గుణశేఖర్ తలపెట్టిన సినిమా హిరణ్యకశ్యప. సురేష్ బ్యానర్ నిర్మాత. అయితే ఈ ప్రాజెక్టు చేతులు మారుతోంది. ఈ మేరకు నిర్మాత సురేష్ బాబు క్లారిటీ ఇచ్చేసారు. మరో పెద్ద దర్శకుడి తో కలిసి చేస్తున్నామని, పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తామని చెప్పారు. 

గుణశేఖర్ ఈ ప్రాజెక్టులో మరి లేనట్లే అని క్లారిటీ ఇచ్చేసారు. ఇంతకీ ఆ పెద్ద దర్ళకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నే అని తెలుస్తోంది. విషయం ఏమిటంటే భీమ్లానాయక్ టైమ్ లో హిరణ్యకశ్యప స్క్రిప్ట్ త్రివిక్రమ్ దగ్గరకు పరిశీలనకు రానా ద్వారా వచ్చింది. అది దాదాపు గతంలో వచ్చిన భక్త ప్రహ్లాద కు జిరాక్స్ లా వుంది. 

అదే పాయింట్ చెప్పి, దాని మీద తన పాయింట్ ఆఫ్ నెరేషన్ కూడా ఇచ్చేసారు త్రివిక్రమ్. అది సూపర్ గా నచ్చేసింది రానా కు. దాంతో గుణశేఖర్ స్క్రిప్ట్ ను పక్కన పెట్టేసి, ఎప్పుడు తీసినా త్రివిక్రమ్ తో తీయాలని ఫిక్స్ అయిపోయారు.

అయితే ఆ ఎప్పుడు అన్నది మాత్రం ఇప్పుడే తెలియదు. ఎందుకంటే త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు, తరువాత బన్నీ సినిమాలు ఓకె చేసి వున్నారు. ఆ రెండింటి తరువాత వుంటుందా? లేక ఇంకా కొంచెం వెనుక్కు వెళ్తుందా అన్నది తెలియాల్సి వుంది. మొత్తానికి ఓ మాంచి మైథలాజికల్ మూవీ త్రివిక్రమ్ నుంచి రావడం అయితే పక్కా.