మా అబ్బాయితో సినిమా తీయరూ…!

పిల్లలతో వ్యవహారం మామూలుగా వుండదు. అందులో సెలబ్రిటీలకు పిల్లలతో మామూలు ప్రెషర్ వుండదు. టాలీవుడ్ లో ఓ దర్శకుడికి ఇదే సమస్యగా వుంది. కొడుకును హీరోగా నిలబెట్టాలని ప్రయత్నం. అది సాగడం లేదు.  Advertisement…

పిల్లలతో వ్యవహారం మామూలుగా వుండదు. అందులో సెలబ్రిటీలకు పిల్లలతో మామూలు ప్రెషర్ వుండదు. టాలీవుడ్ లో ఓ దర్శకుడికి ఇదే సమస్యగా వుంది. కొడుకును హీరోగా నిలబెట్టాలని ప్రయత్నం. అది సాగడం లేదు. 

పట్టుమని పాతికేళ్లు లేకుండానే మాస్ సినిమాలు, యాక్షన్ సినిమాలు, మాఫియా సినిమాలు అలవాటు చేసేసారు. జనం ఇలాంటి వయసుకు మించిన పాత్రలు చేస్తే చూసేది లేదు అని పక్కన పెట్టారు.

దాంతో ఇప్పుడు ఏం చేయాలి? ఏమీ చేయకుంటే ఇంట్లో తంటా. చేయాలంటే కోట్లతో వ్యవహారం. గతంలో ఓ సినిమా కోసం మాంచి ప్రాపర్టీ అమ్మేసిన అనుభవం వుంది. అందుకే ఈ సారి ఇక అలాంటి పని చేసే ఆలోచన లేదు. అందుకే తన కొడుకుతో ఓ సినిమా తీసి పెట్టమని టాలీవుడ్ దర్శకుడు తనకు తెలిసిన టాలీవుడ్ నిర్మాతలను కోరుతున్నట్లు తెలుస్తోంది.

రెమ్యూనిరేషన్ అక్కరలేదు. కథ, మాటలు లాంటి వ్యవహారాలు అన్నీ తాను చూసుకుంటా అని ప్రతిపాదనలు చేస్తున్నట్లు బోగట్టా. కానీ ఎంత రెమ్యూనిరేషన్ లేకపోయినా సినిమా అంటే కనీసం పది కోట్ల వ్యవహారం. అస్సలు మార్కెట్ లేని హీరో మీద ఎవరు మాత్రం అంత రిస్క్ చేస్తారు?