జనాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాల జాబితాలో వున్నాయి నారప్ప, దృశ్యం2. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సినిమాలే ఈ రెండూ. అలాగే రెండూ రీమేక్ లే.
ఈ రెండు సినిమాలను ఓటిటి కి అమ్మేసారు. థియేటర్లు ఇప్పట్లో తెరుచుకుంటాయా? అన్నది అనుమానం కావడంతో ఓటిటితో డీల్ ను దగ్గుబాటి సురేష్ బాబు క్లోజ్ చేసారు.
రెండు సినిమాలను కలిపి మొత్తం 70 కోట్ల మేరకు విక్రయించారని తెలుస్తోంది. ఒకటి హాట్ స్టార్ కు, ఒకటి అమెజాన్ కు విక్రయించారా? లేక రెండూ హాట్ స్టార్ కే విక్రయించారా? అన్న వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.
బహుశా దృశ్యం 2 అమెజాన్ కు, నారప్ప హాట్ స్టార్ కు ఇచ్చి వుండొచ్చు. ఈ రెండు సినిమాలతో పాటు రానా నటించిన విరాటపర్వం సినిమాను కూడా ఓటిటికి ఇచ్చేసేందుకు బేరాలు సాగుతున్నాయని తెలుస్తోంది.
ఆ సినిమాను కూడా ఓటిటికి ఇచ్చేస్తే సురేష్ కాంపౌండ్ నుంచి థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఏవీ ఇప్పట్లో లేనట్లే.