మా సంఘ ఎన్నికల్లో సిట్టింగ్ ప్రెసిండెంట్ నరేష్ కీ రోల్ ప్లే చేస్తారని అంతా అనుకుంటూ వచ్చారు. కానీ ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ చూసేసరికి ఆ ధీమా అంతా సడలిపోతున్నట్లు కనిపిస్తోంది.
ఎవరైతే గత ఎన్నికల్లో నరేష్ పక్కన వున్నారో వారంతా దాదాపుగా జారిపోయినట్లు కనిపిస్తోంది. ఈ రోజు ప్రెస్ మీట్ కు చెప్పుకోదగ్గ జనాలు కనీసం ఇద్దరు ముగ్గురు కూడా లేరు. పైగా ప్రెస్ మీట్ కు సంఘ జనరల్ సెక్రటరీ, నటి జీవిత హాజరవుతారని ముందుగా ప్రకటించారు. కానీ ఆమ రాలేదు.
పైగా తమ శిబిరం నుంచి ప్రకాష్ రాజ్ శిబిరం వైపు ఫిరాయించిన వారిని సస్సెండ్ చేయాలంటూ నటి కరాటే కళ్యాణి డిమాండ్ చేయడం మరీ విడ్డూరంగా వుంది. ఇక్కడేమైనా పార్టీలు వున్నాయా? పార్టీ ఫిరాయింపు చట్టాలున్నాయా? సస్సెండ్ చేయడానికి?
చూస్తుంటే మెగాక్యాంప్ చాలా తెలివిగా నరేష్ వర్గాన్ని బలహీనం చేసినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో నరేష్ కు మెగాక్యాంప్ మద్దతు లభించింది. అప్పటి ప్యానెల్ వున్నవారిలో మెగాక్యాంప్ జనాలు కూడా వున్నారు. ఇప్పుడు వారు మెగా మద్దతు ఎటు వుంటే అటే వుంటారు. అది కామన్. మిగిలిన వారు కూడా చిరంజీవి లేదా మెగా క్యాంప్ మాట కాదని వేరే చోట వుండలేరు.
ఇక్కడ ఏ వర్గం నుంచి ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. ఏ వర్గంతో వుంటే తమ కెరీర్ బాగుంటుంది అని ఎవరైనా ఆలోచిస్తారు. అది కామన్. నరేష్ వర్గానికి బ్యాకింగ్ గా హీరోలు ఎవ్వరూ లేరు. ఒక్క చిరు మద్దతు వుంటే చాలు కనీసం పది మంది హీరోల మద్దతు వున్నట్లే. మా అంటే నటీనటుల సంఘం. అందువల్ల సహజంగా నటీనటులు హీరోల గుడ్ లుక్స్ లో వుండడానికే చూస్తారు.
ఆ విధంగా మొత్తం మీద నరేష్ వర్గం బలహీనపడుతున్నట్లు కనిపిస్తోంది. దీనికి తోడు జీవిత రాజశేఖర్ ను ప్రెస్ మీట్ కు రమ్మని పిలిచారు బాగానే వుంది. ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టాలి? ఆమెకు కూడా అనుకూలమైన చోట. ఎందుకంటే ఆమేమీ నరేష్ వర్గంలో లేరు.
ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. అలాంటపుడు నరేష్ ఇంట్లో జరిగే ప్రెస్ మీట్, నరేష్ మనుషుల మధ్య జరిగే ప్రెస్ మీట్ కు ఎలా హాజరవుతారు. అందుకే డుమ్మా కొట్టారని తెలుస్తోంది. పైగా మోహన్ బాబు కానీ ఆయన కుమారుడు కానీ కృష్ణ, కృష్ణం రాజు లాంటి వాళ్ల ఇళ్లకు వెళ్లి కలిసారని వార్తలు వచ్చాయి.
జీవిత రాజశేఖర్ మద్దతు మాత్రం సింపుల్ గా ఫోన్ లో అడిగేసారని బోగట్టా, రాజశేఖర్ మాత్రం సీనియర్ హీరో కాదా? ఆయన మద్దతు కావాలి అనుకున్నపుడు ఇంటికి రావాలి కానీ ఫోన్ లో అడిగేస్తే సరిపోతుందా? అన్న పాయింట్ కూడా వుందని, విష్ణుకు నరేష్ మద్దతు ఇస్తున్నారు కనుకే, ఆయన ప్రెస్ మీట్ లో పాల్గొనలేదని కూడా తెలుస్తోంది.