మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప. బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో ప్రారంభమైన ఈ సినిమాను రెండు భాగాల్లో విడుదల చేయాలని ఆ మధ్యనే నిర్ణయించారు.
చెప్పాల్సిన కథ, తీయాల్సిన సినిమా చాలా వుండడంతో, రెండు భాగాలు అయితే బెటర్ అని అనుకున్నరు. హీరో బన్నీ కూడా ఈ ప్రపోజల్ కు పచ్చ జెండా ఊపేసాడు. కరోనా రెండు ఫేజ్ తరువాత షూట్ కూడా ప్రారంభం అవుతోంది. అంతవరకు బాగానే వుంది.
ఎలాగూ పుష్ప సినిమా రెండు భాగాలు చేసారు కాబట్టి, ఫస్ట్ పార్ట్ పూర్తయిన తరువాత ఐకాన్ నో మరోటో సినిమా లాగించేసి, రెండో భాగం మీదకు వెళ్లాలన్నది బన్నీ ప్లాన్ గా వుంది. ఐకాన్ బౌండ్ స్క్రిప్ట్ రెడీగా వుంది కూడా. నాలుగునెలల్లో చకచకా ఫినిష్ చేసేయాలన్నది బన్నీ ప్లాన్.
కానీ లేటెస్ట్ గ్యాసిప్ ఏమిటంటే, దర్శకుడు సుకుమార్ తన సినిమా పుష్ప రెండు భాగాలు బ్యాక్ టు బ్యాక్ విడుదల చేయాలని అనుకుంటున్నారని. అలా అయితేనే బాగుంటుందని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.
ఈ మేరకు ఆయన బన్నీకి చెప్పారని, కానీ బన్నీ మాత్రం ఫస్ట్ పార్ట్ పూర్తయిన తరువాత ఎంత లేదన్నా కొంత గ్యాప్ తప్పదని, ఆ గ్యాప్ లో తాను ఐకాన్ పూర్తి చేసేస్తానని అంటున్నారట.
కానీ సుకుమార్ మాత్రం తనకు షూట్ కంటిన్యూగా వుంటేనే చకచకా ఫినిష్ చేస్తానని, తరువాత అంటే మళ్లీ ఆసక్తి తగ్గి, ఆలస్యం అయిపోయే ప్రమాదం వుందని భావిస్తున్నారట, తన వర్కింగ్ సైకాలజీకి రెండు భాగాలు కంటిన్యూగా చేసేస్తేనే బెటర్ అని సుకుమార్ నచ్చ చెబుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు హీరో, డైరక్టర్ ఇధ్దరూ మల్లగుల్లాలు పడుతున్నట్లు బోగట్టా.