తెలంగాణలో థియేటర్లు తెరవడానికి అడ్డంకులేవీ లేవు. ప్రభుత్వం లాక్ డౌన్ ను పూర్తిగా తీసేసింది.
కానీ విడుదల చేయడానికి సినిమాలు ఏవీ లేకపోవడంతో థియేటర్లు తెరచి ఏం చేయాలని ఎగ్జిబిటర్లు అలా వేచి వున్నారు. పైగా ఆంధ్రలో థియేటర్లు తెరవడానికి ఇంకా అనుమతి రాలేదు. అది కూడా ఓ కారణం.
కానీ ఇలా మూసుకుని వుంటే నిర్మాతలు ఎవరికి వారు తమ తమ సినిమాలను ఓటిటిలకు బేరం పెట్టేస్తున్నారు. థియేటర్లు మరో ఒక్క నెల తెరవకపోతే, తరువాత తెరచినా విడుదల చేసేందుకు సినిమాలు వుండవు. అలా నెల నెల వెనక్కు పోవాల్సిన పరిస్థితి వుంటుంది.
అందుకే ఇక ఏది ఏమైనా, ఆంధ్రలో తెరచినా తెరవకున్నా, తెలంగాణలో మాత్రం జూలై నెలాఖరు నుంచి థియేటర్లు తెరవాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ రోజు ఎగ్జిబిటర్లు సమావేశమై డిస్కషన్లు సాగించినట్లు బోగట్టా.