మేటర్ తెలిసిపోయిందా అచ్చెన్నా?

టీడీపీ కోటరీ నుంచి వైఎస్ జగన్ పై నోరుపారేసుకునే వ్యక్తుల్లో అచ్చెన్నాయుడు ముందు వరుసలో ఉంటారు. సమయం, సందర్భం లేకుండా విచక్షణ మరిచిపోయి జగన్ పై అడ్డూఅదుపు లేకుండా విమర్శలు చేశారు అచ్చెన్నాయుడు. అలా…

టీడీపీ కోటరీ నుంచి వైఎస్ జగన్ పై నోరుపారేసుకునే వ్యక్తుల్లో అచ్చెన్నాయుడు ముందు వరుసలో ఉంటారు. సమయం, సందర్భం లేకుండా విచక్షణ మరిచిపోయి జగన్ పై అడ్డూఅదుపు లేకుండా విమర్శలు చేశారు అచ్చెన్నాయుడు. అలా తన పెద్ద గొంతుతో ఇన్నాళ్లూ మీడియాను ఆకర్షించిన అచ్చెన్నాయుడు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.

ఎన్నికల తర్వాత అచ్చెన్నాయుడు కనిపించడం లేదు. చివరికి అమరావతి వచ్చి చంద్రబాబును కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. 2 సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో అమరావతిలో మెరిసిన ఈ నేత, తర్వాత మళ్లీ తెరవెనక్కు వెళ్లిపోయారు. దీనికి కారణం సుస్పష్టం. ఈసారి ఎన్నికల్లో అచ్చెన్నాయుడు ఓడిపోవడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన తన నోటికి తానే తాళం వేసుకోవడానికి ఇదే కారణం అంటున్నారు.

టెక్కలి నియోజకవర్గంలో ఈసారి హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. అయినప్పటికీ ఎడ్జ్ మాత్రం ఎక్కువగా వైసీపీకే ఉందనే టాక్ వినిపిస్తోంది. అక్కడ అచ్చెన్నాయుడికి వ్యతిరేకంగా బరిలోకి దిగిన వైసీపీ అభ్యర్థి తిలక్, తన కాళింగ సామాజిక వర్గాన్ని ఒకే తాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అదే ఇప్పుడు అచ్చెన్నాయుడుకు ఎదురుదెబ్బగా మారిందంటున్నారు. ఆ నియోజకవర్గంలో కాళింగ వర్గీయులే ఎక్కువ. వాళ్లంతా అచ్చెన్నాయుడుకు ఎదురుతిరిగినట్టు తెలుస్తోంది.

దీనికితోడు టెక్కలిలో ఓ సెంటిమెంట్ ఉండనే ఉంది. ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే, మరోసారి ఇక్కడ గెలవరు. అవును.. ఏ ఎమ్మెల్యేకు బ్యాక్ టు బ్యాక్ గెలిచిన చరిత్ర లేదిక్కడ. ఇలా చూసుకున్నా ఈసారి అచ్చెన్న ఇంటికెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇవన్నీ తెలుసుకున్న సదరు ఆపద్ధర్మ మంత్రి సైలెంట్ అయినట్టు తెలుస్తోంది. మరో 2 వారాల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు బయటకు రాబోతున్నాయి. 

ఫలితాలకు ముందే జగన్ వైపు చూస్తున్నారా?