యూరోస్ చేతికి ‘అర్జున్ సురవరం’

నిఖిల్ నటించిన అర్జున్ సురవరం లేటెస్ట్ డేట్ మే 17 లేదా 24. ఒక్కోసారి ఒక్కో కారణం వల్ల ఈ సినిమా వెనక్కు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఈసారి మాత్రం ఇక వాయిదా అన్నది…

నిఖిల్ నటించిన అర్జున్ సురవరం లేటెస్ట్ డేట్ మే 17 లేదా 24. ఒక్కోసారి ఒక్కో కారణం వల్ల ఈ సినిమా వెనక్కు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఈసారి మాత్రం ఇక వాయిదా అన్నది పెట్టుకోవడం లేదు. మహర్షి రిజల్ట్ చూసి 17 లేదా 24 అన్నది డిసైడ్ చేస్తారు.

ఒకే ప్రొడ్యూసర్ ఒకే సమయంలో రెండు మూడు సినిమాలు నిర్మించడం, వాటి డేట్ లు క్లాష్ కావడం, అదే టైమ్ లో మహర్షి డేట్ అడ్డంపడడం ఇలా అనేక కారణాలవల్ల అర్జున్ సురవరం లేట్ అవుతూ వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో యూరోస్ సంస్థ అర్జున్ సురవరం ప్రాజెక్టులో జాయిన్ కావడం విశేషం. 

యూరోస్ సంస్థ ఈసినిమా పబ్లిసిటీకి సహకరిస్తుంది. అలాగే నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకుంటుంది. టాగోర్ మధు తన లైట్ హౌస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ దర్శకుడు.