బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఈ మధ్య సౌత్ సినిమాలపై ఫోకస్ ఎక్కువ పెట్టినట్లున్నాడు. బాలీవుడ్ మూవీ 'పింక్'ని తమిళంలో అజిత్‌తో రీమేక్ చేస్తున్నారు బోనీకపూర్. ఈ సినిమా తర్వాత కూడా అజిత్‌తో పలు సినిమాలు నిర్మించేందుకు బోనీకపూర్ ప్రత్యేకమైన ఆసక్తి ప్రదర్శిస్తుండడం గమనార్హం. బోనీకపూర్ ఆల్రెడీ అజిత్‌కి మూడుకథలు విన్పించాడట. అన్నీ యాక్షన్ ఎంటర్టైనర్లేనని స్వయంగా బోనీకపూర్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. అయితే అజిత్ నుంచి మాత్రం సమాధానం రావాల్సి వుందట.
బాలీవుడ్‌కి అజిత్ రావాల్సిందిగా తాను కోరుతున్నాననీ, కథల ఎంపికలో ఛాయిస్ అజిత్దేననీ, ఆయన నటనా ప్రతిభను ప్రత్యక్షంగా చూశాక బాలీవుడ్‌కి మ్యాచ్ అయ్యే పర్సనాలిటీ అని ఫిక్సయ్యే అజిత్‌ని బాలీవుడ్‌కి పిలుస్తున్నాననీ బోనీకపూర్ చెబుతున్నాడు. అయితే, అజిత్ మాత్రం బాలీవుడ్ పట్ల మరీ అంత ఆసక్తిగా వున్నట్లు కన్పించడంలేదు.
గతంలో ఇదే విషయమై అజిత్‌ని ప్రశ్నిస్తే, 'నేను తమిళ సినిమాలతో హ్యాపీగా వున్నాను.. తమిళ సినిమాల్ని వదులుకుని బాలీవుడ్‌కి వెళ్ళే ఉద్దేశ్యం లేదు' అని తేల్చేశాడు అజిత్. 'అశోక', 'ఇంగ్లిష్ వింగ్లిష్' తదితర హిందీ సినిమాల్లో నటించినా, అతిథి పాత్రలకే పరిమితమయ్యాడు అప్పట్లో అజిత్.
కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అన్న హద్దులు చెరిగిపోయి.. ఇండియన్ సినిమా అనే భావన దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లోనూ కన్పిస్తోంది. నిజానికి, డబ్బింగ్ సినిమాలతో అజిత్‌కి బాలీవుడ్‌లోనూ ఈ మధ్యకాలంలో ఫాలోయింగ్ బాగానే పెరిగింది. దాంతో అజిత్, హిందీ సినిమాల్లో నటించాలని అతని అభిమానులూ కోరుకుంటున్నారు.
అన్నట్టు అజిత్‌కి తెలుగులో మార్కెట్ వాల్యూ చాలా తక్కువ. అతని సినిమాలు తెలుగులో రీమేక్ అవడం చూస్తుంటాం. అజిత్ మాత్రమేకాదు, విజయ్‌కీ తెలుగులో మార్కెట్ తక్కువ. రజనీకాంత్, సూర్య, కార్తీ తదితరులకున్న ఫాలోయింగ్ విజయ్, అజిత్ తెలుగునాట సంపాదించుకోలేకపోతున్నారు.