Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శివ నిర్వాణ, దేవరకొండ సినిమాపై క్లారిటీ

శివ నిర్వాణ, దేవరకొండ సినిమాపై క్లారిటీ

ప్రస్తుతం టాలీవుడ్ లో జోరుగా నడుస్తున్న గాసిప్ ఇది. మజిలీతో హిట్ కొట్టిన శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడనే న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రాజెక్టు ఇంకా ఓకే అవ్వలేదు. ప్రాధమిక చర్చలు మాత్రం పూర్తయ్యాయి.

మజిలీ సినిమా సెట్స్ పై ఉంటుండగానే విజయ్ దేవరకొండకు ఓ స్టోరీలైన్ వినిపించాడు శివ నిర్వాణ. అదే ఇప్పుడిలా బయటకు వచ్చింది. ఈ లైన్ కు దేవరకొండ ఓకే చెప్పాడా లేదా అనే విషయంపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ చాలా బిజీ.

డియర్ కామ్రేడ్ సినిమాను పూర్తిచేసిన ఈ హీరో తమిళ దర్శకుడు ఆనంద్ తో ఓ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. దీనికోసం ఢిల్లీలో కారు రేస్ కూడా నేర్చుకున్నాడు. ఈ మూవీతో పాటు క్రాంతిమాధవ్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై మరో సినిమా చేస్తున్నాడు.

ఈ రెండు సినిమాలు కొలిక్కి వచ్చే వరకు మరో ప్రాజెక్టు గురించి ఆలోచించదలుచుకోలేదు దేవరకొండ. అందుకే శివ నిర్వాణ సినిమాకు ఓకే చెప్పలేదు. కేవలం చర్చలు మాత్రమే ప్రారంభించాడు. ప్రాజెక్ట్ ఓకే అవుతుందా అవ్వదా అనే విషయం తేలడానికి మరికొన్ని నెలలు పడుతుంది.

చివరికి పవన్ కల్యాణ్ కథ ఇదీ!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?