Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సంతోష్ శ్రీనివాస్ - ఓ సినిమా ప్లీజ్

సంతోష్ శ్రీనివాస్ - ఓ సినిమా ప్లీజ్

టాలీవుడ్ ఇదివరకటిలా లేదు. ప్రతి సినిమా పరుగుపందెమే. ప్రతి సినిమా గెలవాల్సిందే. లేదంటే సింపుల్ గా పక్కన పెట్టేస్తారు. జరుగు..జరుగు.. ఇంకోడొస్తున్నాడు అంటూ , మరొకరు ఆ సీటు ఆక్యుపై చేసేస్తారు. ఇలా పరుగుపందెంలో గెలవాలి అంటే విషయం వుండాలి. కందిరీగ సినిమాతో సర్రున దూసుకువచ్చిన శ్రీనివాస్, రభస సినిమాతో ఎక్కడికో వెళ్లిపోతాడనుకున్నారు. కానీ ఇక్కడే ఎక్కడో వుండిపోయాడు. ఎన్టీఆర్ లాంటి వాడు చాన్స్ ఇస్తే వాడుకోలేకపోయాడు.

ఇదంతా జరిగి అయిదేళ్లవుతోంది. కానీ టాలీవుడ్ మాత్రం ఆ గాయం మరిచిపోలేదు. మళ్లీ ఇప్పటి దాకా సంతోష్ శ్రీనివాస్ చేతికి సినిమా రాలేదు. ఏడాదిన్నర క్రితం పవన్ తో సినిమా చేసే చాన్స్ వచ్చింది. తెరి రీమేక్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసే చాన్స్. కానీ అది అలా చేజారిపోయింది. అదే సినిమా రవితేజతో అనుకుంటే అదీ చేజారిపోయింది.

ఆఖరికి ఇప్పుడు ఆ నిర్మాతలు కూడా బై బై చెప్పేసినట్లు తెలుస్తోంది. అంటే ప్రాజెక్టు ఆగిపోవడం మాత్రమే కాదు, సంతోష్ కు సినిమా కూడా లేకుండా అయిపోయింది.  అందువల్ల ఇప్పుడు ఏ హీరో అయినా, నిర్మాత అయినా డైరక్టర్ కావాలనుకుంటే సంతోష్ శ్రీనివాస్ రెడీ అన్నమాట. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?