కోరలు చాచిన కరోనా వైరస్‌పై ప్రజల్లో అల్లకల్లోం కొనసాగుతోంది. ప్రశాంతంగా ఉండే ఉభయ గోదావరి జిల్లా జనం ప్రస్తుతం కంటికి కునుకు లేకుండా గడుపుతున్నారు. జనతా కర్ఫ్యూ మొదలు ప్రస్తుతం సాగుతున్న లాక్‌డౌన్ పరిస్థితుల వరకూ అన్ని వర్గాలనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి.
అయితే ఢీల్లీలో జరిగిన ముస్లిం మత ప్రార్ధనల్లో పాల్గొని నేరుగా గోదావరి జిల్లాకు వచ్చిన కరోనా బాధితులతో ఈ ప్రాంతం అతలాకుతలమవుతోంది. కాకినాడ, పెద్దాపురం, రాజమహేంద్రవరం సహా ఉభయ గోదావరి జిల్లాల్లోని గ్రామాలు, పట్టణాలకు చెందిన వ్యక్తులు ఢీల్లీ సభకు వెళ్ళి రావడం ఆయా వర్గాలను తీవ్రంగా కలచివేస్తోంది.
ఆయా ప్రాంతాల్లో గుర్తించిన బాధితులకు ప్రస్తుతం చికిత్స అందజేస్తున్నారు. వ్యాధి ఇంకా ఎవరెవరికి సోకి ఉంటుందనే విషయమై సంబంధిత శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. సంబంధిత శాఖ ఉద్యోగుల ప్రాణాకు తెగించి మరీ విధులు నిర్వహిస్తున్నారు. వైద్యారోగ్య, పోలీస్, శానిటేషన్ శాఖకు చెందిన ఉద్యోగు భూమిక ఇపుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యింది.
ఇంకోవైపు ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్షాకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు ఎవరి ఇంటికి వారు పరిమితమయ్యారు. ప్రజల్లోకి వచ్చేందుకు ఏ ఒక్క రాజకీయ నాయకుడూ సాహసించడం లేదు! అయితే కరోనా మహమ్మారిపై సాగుతోన్న పోరాటం గోదావరి జిల్లాల్లో పతాక స్థాయికి చేరింది. ప్రస్తుతం వ్యాధి బారిన పడిన బాధితును పూర్తిగా ఐసోలేషన్‌లో ఉంచారు. బాధితుల కుటుంబ సభ్యులను, స్నేహితులను, పరిచయస్థులను అదుపులోకి తీసుకుని క్వారెంటెయిన్‌కు తరలించారు.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో అనుమానాస్పద ప్రదేశాను ఐసోలేషన్ చేస్తున్నారు. వైద్యారోగ్య, ప్రజారోగ్య, పోలీస్, శానిటేషన్, పురపాలక పట్టణాభివృద్ధి, రెవెన్యూ, విద్యుత్ తదితర శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నగర/పట్టణ/గ్రామీణ ప్రాంతాల్లో భారీ ఎత్తున హెచ్చరికతో కూడిన ప్రచారం చేస్తున్నారు. మీడియా ప్రతినిధులు ఎప్పటిలాగే తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారు.
ఎవరి ఇళ్ళకు వాళ్ళు పరిమితం కావాని, అత్యవసర పరిస్థితుల్లో రావాల్సి వస్తే కుటుంబం నుండి ఒకరు మాత్రమే బయటకొచ్చి సామాజిక దూరం పాటించాని పోలీసు హెచ్చరిస్తున్నారు. ప్రతివొక్కరూ ముఖానికి, ముక్కుకూ మాస్క్ ధరించాలని, ప్రతి గంటకూ ఓ సారి చేతును శుభ్రంగా సబ్బు లేక డెటాయిల్‌తో కడుక్కోవాని, చేతి వేళ్ళతో ముఖాన్ని తాకకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. ఉదయం 7 నుండి 11 గంట వరకు మాత్రమే నిత్యావసర సరుకును కొనుగోలు చేసే అవకాశం కల్పించారు.
కాగా నిత్యావసరాను రేషన్ షాపు ద్వారా అందించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం విఫమయ్యింది. ప్రజలు రేషన్ షాపు వద్ద గుంపుగా ఉండటంతో ఇది మరింత ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ యంత్రాంగం గమనించింది. దీంతో వాంటీర్ల ద్వారా లబ్ధిదారుడి ఇంటికే నేరుగా రేషన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి గ్రామ/వార్డు వాంటీర్ల ద్వారా రేషన్ సరుకును ఇళ్ళకే నేరుగా పంపిస్తామని ఎన్నికకు ముందు జగన్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇంతవరకూ ఇంటింటికి సరుకు పంపిణీ హామీ అమలుకు నోచుకోలేదంటూ ప్రభుత్వంపై జనం విమర్శు చేస్తున్నారు.