ఇక విశాఖ క్రీడా రాజధాని కూడా…

విశాఖకు ఎన్నో బిరుదులు ఉన్నాయి. ఆర్ధిక రాజధాని, సాంస్కృతిక రాజధాని, పర్యాటక సినీ రాజధాని అని కూడా చెబుతారు. అలాగే ఐటీ హబ్ ని విశాఖను పేర్కొంటారు.  Advertisement ఇవన్నీ ఇలా ఉంటే విశాఖ…

విశాఖకు ఎన్నో బిరుదులు ఉన్నాయి. ఆర్ధిక రాజధాని, సాంస్కృతిక రాజధాని, పర్యాటక సినీ రాజధాని అని కూడా చెబుతారు. అలాగే ఐటీ హబ్ ని విశాఖను పేర్కొంటారు. 

ఇవన్నీ ఇలా ఉంటే విశాఖ మన పరిపాలనా రాజధాని అంటూ జగన్ సర్కార్ ఏడాది క్రితం అసెంబ్లీలో చట్టం చేసింది. అదిపుడు న్యాయ విచారణలో ఉంది. ఇక విశాఖను క్రీడా రాజధానిగా చేస్తామని కూడా ఎప్పటి నుంచే చెబుతూ వస్తున్నారు.

దానికి తగినట్లుగానే ఇపుడు విశాఖలో బాడ్మింటన్ అకాడమీ  ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాల స్థలాన్ని మంజూరు చేసింది. ప్రఖ్యాత బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు విశాఖలోని హార్ట్ ఆఫ్ ది సిటీ ప్రాంతంలో ఈ భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

దాంతో విశాఖలో బాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. తాను తొందరలోనే అకాడమీని ఏర్పాటు చేస్తానని సింధు పేర్కోన్నారు. విశాఖలో వైఎస్సార్ క్రికెట్ స్టేడియం ఉంది. 

ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఇక్కడ జరుగుతాయి. విశాఖలో ఎంతో మంది క్రికెట్ క్రీడాకారులు కోచింగ్ తీసుకుంటున్నారు. మిగిలిన క్రీడలకు కూడా అవకాశాలు పెరగాల్సి ఉండగా బాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుతో విశాఖలోని క్రీడాకారులకు కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.