నేనే రాజు నేనే మంత్రి సినిమాపై ఈ మాత్రమైనా బజ్ క్రియేట్ అయిందంటే దానికి కారణం రానానే. బాహుబలి-2 సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రానా ఇందులో హీరోగా నటిస్తున్నాడు. అదే ఈ సినిమాకు మెయిన్ ప్రమోషనల్ ఎలిమెంట్. అందుకు తగ్గట్టే రానా కూడా దశలవారీగా ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో మేటర్ ను బయటకు వదుల్తున్నాడు.
తాజాగా టీజర్ రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశాడు. జూన్ 6న టీజర్ రాబోతోందని ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈమధ్య కాలంలో తేజ డైరక్ట్ చేసిన ఏ సినిమాకూ ఇంత హైప్ రాలేదు. ఇంత భారీస్థాయిలో రిలీజ్ కూడా లేదు.
ఈ సినిమా రిజల్ట్ తేడాకొడితే రానాకు ఏం కాదు. అటు కాజల్ కు కూడా పోయేదేం లేదు. కానీ తేజ భవిష్యత్తు మాత్రం దీనిపైనే ఆధారపడి ఉంది. ఇది హిట్ అయితే బడా హీరోల సంగతి అటుంచి, కనీసం మీడియం రేంజ్ హీరోలైనా తేజ సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. లేదంటే మరోసారి అంతా కొత్త వాళ్లతో సినిమా తీసుకోవాల్సిందే. ఈ సినిమాలో పొలిటికల్ లీడర్ జోగేంద్రగా రానా కనిపించనున్నాడు.