కృతీ సనన్ తెలుగులో వచ్చిన అవకాశాలు పెద్ద సినిమాల్లోనే అయినా ఎందుకో బరిలో నిలవలేకపోయింది. ‘వన్’ ‘దోచెయ్’ వంటి సినిమాలు పర్వాలేదనిపించినా కృతికి మాత్రం టాలీవుడ్లో ఆ తర్వాత అవకాశాలు రాలేదు. అయితేనేం.. అంతకు మించి ఈమె బాలీవుడ్ లో అవకాశాలు సంపాదిస్తూ వస్తోంది. షారూక్ వంటి హీరోతో కూడా ఒక సినిమాలో నటించేసింది.. సినిమాలతో బిజీబిజీగా గడిపిస్తోంది.
ఈ సంగతిలా ఉంటే.. కృతికి సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం ప్రచారంలోకి వచ్చింది. వరసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వస్తున్న ఈ భామ ఇప్పుడు ఒక స్టార్ హీరోతోనే డేటింగ్ చేస్తోందనేది. అతడు మరోవరో కాదు.. ‘ధోనీ’ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్.
సుశాంత్- కృతిలు బాగా దగ్గరయ్యారని.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల న్యూ ఇయర్ వేడుకులను కూడా ఈ జంట కలిసి జరుపుకుందట. ఈమెతో పండగ సంబరం కోసం ప్రత్యేకంగా లండన్ కు వెళ్లాడట సుశాంత్. ఇదంతా చూస్తుంటే.. వీరి ప్రేమ గాఢంగానే ఉందని అనుకోవాల్సి వస్తోంది.