గ‌డియారం చూసి బాంబ్ అనుకుని బేడీలేశారు…

నిండా ప‌థ్నాలుగేళ్లు లేని కుర్రాడు. క్రియేటివిటీకి ప‌దును పెట్టాడు. వాల్‌క్లాక్ తయారు చేశాడు. అది చూపించి టీచ‌ర్ల‌ను ఇంప్రెస్ చేద్దామ‌నుకున్నాడు. అయితే బ్యాగులో మోగుతున్న ఆ అలారం శ‌బ్ధం ఆ టీచ‌ర్ల‌ను ప‌రుగులు పెట్టించింది.…

నిండా ప‌థ్నాలుగేళ్లు లేని కుర్రాడు. క్రియేటివిటీకి ప‌దును పెట్టాడు. వాల్‌క్లాక్ తయారు చేశాడు. అది చూపించి టీచ‌ర్ల‌ను ఇంప్రెస్ చేద్దామ‌నుకున్నాడు. అయితే బ్యాగులో మోగుతున్న ఆ అలారం శ‌బ్ధం ఆ టీచ‌ర్ల‌ను ప‌రుగులు పెట్టించింది. అత‌డు త‌యారు చేసింది బాంబు అని భ్ర‌మించేలా చేసింది. అంతే…ఆ కుర్రాడు చ‌దువుతున్న స్కూల్ వెనుకా ముందూ చూడ‌కుండా ఆ కుర్రాడిని స‌స్పెండ్ చేసేయ‌డ‌మే కాకుండా పోలీసుల‌కు అప్ప‌గించింది. 

అమెరికాలోని టెక్సాస్‌ న‌గ‌రంలో చోటు చేసుకుందీ ఉదంతం. అక్క‌డి స‌బ‌ర్బ‌న్ డ‌ల్లాస్ హైస్కూల్‌లో చ‌దివే అహ్మ‌ద్ మ‌హ్మ‌ద్ అనే 14 ఏళ్ల విద్యార్ధి… కొత్త వ‌స్తువులు త‌యారు చేయాల‌నే ఉత్సాహం ఉన్న‌వాడు. తాజాగా ఒక అలారంను త‌యారు చేసి త‌న స్కూల్‌కి తీసుకొచ్చాడు. అయితే దాన్ని బాంబుగా అపోహ‌ప‌డిన టీచర్లు, స్కూల్ అధికారులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ కుర్రాడ్ని అదుపులోకి తీసుకున్నారు. చేతికి బేడీలు వేసి మ‌రీ క‌ట్ట‌డి చేశారు. 

ఈ ఉదంతం సోష‌ల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. ఆ కుర్రాడి పేరు, మ‌త‌మే అత‌డి పాలిట శాప‌మ‌య్యాయా అంటూ ప్ర‌శ్న‌లు రేగాయి దీంతో సాక్షాత్తూ అమెరికా అధ్య‌క్షుడు బరాక్ ఒబామా స్పందించారు. కూల్ క్లాక్ అహ్మ‌ద్ అంటూ ఆయ‌న ట్విట్ట‌ర్‌లో అభినందించారు. దానిని వైట్ హౌజ్‌లోకి తీసుకొద్దామ‌నుకుంటున్నావా? అంటూ ప్ర‌శ్నించారు. 

సైన్సు అంటే ఇష్ట‌ప‌డే మీ లాంటి పిల్ల‌ల‌కు మ‌రింత స్పూర్తిని అందివ్వాల్సిన బాధ్య‌త మా మీద ఉందన్నారు. అదే అమెరికాను విజేత‌గా నిలుపుతుంద‌న్నారు. ప్ర‌స్తుతం ఈ 14 ఏళ్ల కుర్రాడు అమెరికా అధ్య‌క్షునికి అతిధి కానున్నాడు. అతిర‌ధ మ‌హార‌ధుల వంటి సైంటిస్టులు, ఇంజ‌నీర్లు, ఆస్ట్రానాట్స్ పాల్గొనే అక్టోబ‌రు 19న వైట్ హౌజ్‌లో జ‌రిగే అస్ట్రాన‌మీ నైట్ కార్య‌క్ర‌మానికి గెస్ట్‌గా ఆహ్వానం అందుకున్నాడు.