మారింది ప్ర‌భుత్వ‌మే.. ఉపాధ్యాయుల బాధ‌లు య‌థాత‌థం!

జ‌గ‌న్ స‌ర్కార్ దిగిపోతే, త‌మ బ‌తుకులు మారిపోతాయ‌ని ఉపాధ్యాయులు అనుకున్నారు. ఎలాగైనా జ‌గ‌న్‌ను గ‌ద్దె దించాల‌ని ఉపాధ్యాయులంతా ఏక‌తాటిపైకి వ‌చ్చారు. ఉపాధ్యాయులంతా క‌ట్టుకట్టుకుని వైసీపీకి వ్య‌తిరేకంగా ఓట్లు వేశారు. వైసీపీ ఓట‌మితో సంబ‌రాలు చేసుకున్నారు.…

జ‌గ‌న్ స‌ర్కార్ దిగిపోతే, త‌మ బ‌తుకులు మారిపోతాయ‌ని ఉపాధ్యాయులు అనుకున్నారు. ఎలాగైనా జ‌గ‌న్‌ను గ‌ద్దె దించాల‌ని ఉపాధ్యాయులంతా ఏక‌తాటిపైకి వ‌చ్చారు. ఉపాధ్యాయులంతా క‌ట్టుకట్టుకుని వైసీపీకి వ్య‌తిరేకంగా ఓట్లు వేశారు. వైసీపీ ఓట‌మితో సంబ‌రాలు చేసుకున్నారు. బోధ‌నేత‌ర ప‌నులు చేసే ఖ‌ర్మ త‌ప్పుతుంద‌ని క‌ల‌లు క‌న్నారు. త‌మ‌ను బోధ‌న‌కే ప‌రిమితం చేయాల‌ని, జ‌గ‌న్ స‌ర్కార్ హ‌యాంలో బోధ‌నేత‌ర ప‌నుల‌కు ప‌రిమితం చేయ‌డం వ‌ల్ల విద్యార్థుల‌కు చ‌దువు చెప్ప‌లేక‌పోయామ‌ని విద్యాశాఖ మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు.

ఇక‌పై ఉపాధ్యాయుల‌తో బోధ‌నేత‌ర పనులు చేయించొద్ద‌ని లోకేశ్ అప్ప‌టిక‌ప్పుడే ఆదేశాలు ఇచ్చారు. ఉపాధ్యాయుల‌కు బోధ‌నేత‌ర ప‌నుల నుంచి లోకేశ్ విముక్తి క‌లిగించార‌ని ప్ర‌భుత్వ అనుకూల మీడియా ఊరూవాడా కోడై కూసింది. సీన్ క‌ట్ చేస్తే… ప్ర‌ధానోపాధ్యాయుల‌కు గ‌మ‌నిక అంటూ నిత్యం మెసేజ్‌లు. బాబు గారొచ్చినా… బ‌తుకులు మార‌లేద‌ని ఉపాధ్యాయులంతా ఆవేద‌న రాగం అందుకున్నారు. ఇంత‌కూ ప్ర‌ధానోపాధ్యాయుల‌కు నిత్యం వ‌చ్చే మెసేజ్ ఎలా వుంటుందంటే..

❤️ ప్రధానోపాధ్యాయులకు గమనిక ❤️

❤️మధ్యాహ్న భోజనం (పీఎం పోషన్) మరియు స్కూల్ శానిటేషన్‌లో భాగంగా
 ప్రతి రోజూ చేయాల్సిన ప‌నులు:-

1) స్టూడెంట్ అటెండన్స్   10 .30 AM  గంటల్లోపు
2) TMF కు సంబంధించి ఆయా అటెండన్స్ 10 .30 AM  గంట‌ల్లోపు!
3) TMFకు సంబంధించి టాయిలెట్ ఫొటో క్యాప్ట్యూరింగ్  10 .30 AM  గంట‌ల్లోపు!
4)ఎం డి ఎం మెనూ క్యాప్ట్యూరింగ్ (HM INSPECTION )  1 .30 PM  లోపు
5) ACTUAL MEALS AVAILED DETAILS 1.30 PM  లోపు
6) I  F A టాబ్లెట్స్ UPDATION ప్రతి రోజు   2 .00  PM  లోపు

ప్రతి నెలా చేయాల్సిన పనులు

1) రైస్, ఎగ్ ,చెక్కి ప్రతి నెలా తేదీ 10 నుండి తేదీ 14 లోపు
2) రాగి, జాగారి ఇండెంట్ ప్రతి నెలా తేదీ 25 నుండి తేదీ 30 లోపు
3) ఎగ్, చెక్ రెసెప్ప్ట్ కన్ఫర్మేషన్ ప్రతి నెలా తేదీ 26 నుండి  తేదీ 30 లోపు
4) TMF కు సంబందించి ఆయా (AYA ) నెలవారీ అటెండన్స్ ప్రతి నెలా తేదీ 25 నుండి తేదీ 30 లోపు

మండల విద్యాశాఖాధికారులంతా ఆయా మండ‌లాల‌కు సంబంధించిన పాఠశాలలు మధ్యాహ్న భోజన ప‌థ‌కం మరియు స్కూల్ శానిటేషన్ ప్రతి దినం సంబంధిత App లో అప్లోడ్ చేయుచున్నది, లేనిది పర్యవేక్షించవలెను. ఇద‌న్న మాట.. మెసేజ్‌.

ఈ మెసేజ్‌లో ఎక్క‌డైనా చ‌దువుకు సంబంధించి అక్ష‌రం ముక్క క‌నిపిస్తోందా? అంటే… లేనేలేదు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి త‌మ నెత్తిన పెనుభారాన్ని పెట్టార‌నే క‌దా ఆయ‌న పార్టీపై విప‌రీతంగా నెగెటివ్ ప్ర‌చారాన్ని ఉపాధ్యాయులు చేసింది! మ‌రిప్పుడు మెసేజ్ ప్ర‌కారం బోధ‌నేత‌ర ప‌నులు చేయ‌డ‌మా? లేక సమ‌ర‌మా?. త‌మ‌పై బోధ‌నేత‌ర ప‌నుల భార‌మే లేక‌పోతే, ప్ర‌తి పిల్లాడిని ఐఏఎస్‌, ఐపీఎస్‌లు తీర్చిదిద్దేవాళ్ల‌మ‌న్నంత‌గా ఉపాధ్యాయులు బిల్డప్‌లు చేస్తుంటార‌ని, వాళ్లు ఏమీ చేసుకోలేర‌ని కూట‌మి నేత‌లు కామెంట్స్ చేస్తున్నారు. అధికారంలోకి ఎవ‌రొచ్చినా ఉపాధ్యాయుల‌కు ఇవి త‌ప్ప‌వ‌ని విద్యాశాఖ అధికారులు అంటున్నారు.