ఇతరులను ఆకర్షించడం ఎలా.. అనే ప్రశ్నకు బోలెడన్ని సమాధానాలు దొరుకుతాయి! అవి ఎవరికి వారు ఇచ్చుకునేవి! ఇందుకోసం కొందరు ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. ఆ ట్రిక్స్ కు కొందరు ఆకర్షితులవుతారు కూడా! అయితే ట్రిక్స్ అనేవి లాంగ్ టైమ్ మీద కొనసాగేవి కావు. ఏదో తాత్కాలికం! అయితే స్వయం ప్రకాశకుల్లాగా.. మనిషి తనను తాను అట్రాక్టివ్ గా కూడా మలుచుకోవచ్చు. కార్పొరేట్ యుగంలో.. ఇలా వెలుగొందే వారే కెరీర్ పరంగా కూడా ఎదగగలరు! మరి అట్రాక్టివ్ మ్యాన్ గా మారడానికి అలవరుచుకోదగిన అలవాట్లు ఏవంటే!
సెల్ఫ్ కాన్ఫిడెన్స్!
మీ నడవడికలో అది బయల్పడాలి! అలాగని అతిగా కాన్ఫిడెన్స్ ను కనబరచడం, ఓవర్ కాన్ఫిడెన్స్ తో యాక్ట్ చేయడం మొదటికే మోసాన్ని తెస్తుంది. మీ బలం ఏమిటో తెలిసి ఉండటం, మీ బలహీనతలను గుర్తుంచుకోవడమే నిజమైన ఆత్మవిశ్వాసం! మీ బలాన్నే అతిగా ఊహించుకుంటూ బలహీనతలను పట్టించుకోకపోయినా, బలహీనలతనే అతిగా భావించినా తేడా కొడుతుంది! కాబట్టి.. బలాబలాలను బ్యాలెన్స్ చేసుకుంటూ సాగితే.. మీరు నడవడిక పక్కాగా ఉంటుంది. అప్పుడే మీరు మ్యాగ్నటిక్ గా మారతారు అనడంలో ఆశ్చర్యం లేదు!
మంచి కమ్యూనికేషన్ స్కిల్స్!
మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీ కాన్ఫిడెన్స్ ను పెంపొందిస్తాయి. కాన్ఫిడెంట్ గా ఎక్స్ ప్రెస్ చేయగలవారు కచ్చితంగా అట్రాక్టివ్ అవుతారు! మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ను కలిగి ఉండటం అంటే.. అనర్గళంగా అనవసరం ఉపన్యసించడం ఏమీ కాదు! తగ్గట్టైన పదాలతో అయినా.. మీ అభిప్రాయాలను వెలిబుచ్చగల కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అర్థవంతంగా సంభాషించగలగడం, ఇతరులపై నిజాయితీతో కూడిన ఆసక్తిని కనబరచడం కూడా మిమ్మల్ని ఆకర్షవంతంగా మార్చగల కమ్యనికేషన్ స్కిల్స్ ను కలిగి ఉన్నట్టే!
ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ను కలిగి ఉండటం!
ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనేది కామన్ సెన్స్. చుట్టూ ఉన్న మనుషులను బట్టి ఈ సెన్స్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా కలిగి ఉండాలి. ఇతరులతో మీ తీరు దయగలిగినది అయి ఉండాలి. ఎంపతీని కలిగి ఉండటం గొప్ప లక్షణం. మ్యూచువల్ రస్పెక్ట్ ను మెయింటెయిన్ చేయాలి.
తృప్తికరమైన జీవితాన్ని లీడ్ చేయడం!
సంతృప్తి అనేది పెద్ద మాట! అయితే కనీసం తృప్తిగా అయినా బతకాలి. అప్పుడే ఇతరులు కూడా మీతో ఎంగేజ్ కావడానికి ఇష్టపడతారు. మీ కోరికలే అనంతమైన రీతిలో ఉంటే, మీరే వాటి గురించి నిరంతరం ధ్యానిస్తూ ఉంటే ఇతరులు మీతో కలవడానికి కూడా పెద్ద ఇష్టపడరు! అర్థవంతమైన హాబీలు, ఇంట్రస్ట్ లు, కొన్ని రకాల ప్రిన్సిపుల్స్ ను పెట్టుకుని బతుకుతూ ఉండటం, ఆనందంగా ఉండటం.. ఇవన్నీ మీ పట్ల ఇతరుల్లో ఆసక్తిని పెంచుతాయి, మిమ్మల్ని ఒక అట్రాక్టివ్ పర్సన్ గా నిలబెడతాయి!