పవన్! ఏంటమ్మా ఈ దిక్కుమాలిన స్క్రిప్ట్?

పవన్ కళ్యాణ్ కి పిచ్చెక్కిందన్నది సామాన్య జనాభిప్రాయం. అతను ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని కొందరు విజ్ఞుల భావన. Advertisement గోబెల్స్ ప్రచారం చేస్తే చేసాడు..స్క్రిప్ట్ రాసుకోవడంలో మరీ ఇంత…

పవన్ కళ్యాణ్ కి పిచ్చెక్కిందన్నది సామాన్య జనాభిప్రాయం. అతను ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని కొందరు విజ్ఞుల భావన.

గోబెల్స్ ప్రచారం చేస్తే చేసాడు..స్క్రిప్ట్ రాసుకోవడంలో మరీ ఇంత వీకా అని పెదవి విరిస్తున్నారు ఇంకొంతమంది. 

ఇంతకీ ఈ అభిప్రాయాలకి కారణమేంటి? పవన్ కళ్యాణ్ వాలంటీర్స్ ని వ్యభిచార బ్రోకర్స్ గా చిత్రీకరించడం. ఏ ఇంటిలో ఎంతమంది ఆడవాళ్లు ఉంటారు, వారిలో ఒంటరి వాళ్లు ఎంతమంది, వితంతువులు ఎందరు, అమ్మాయిలుంటే వాళ్లకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా లాంటి డేటా మొత్తం సేకరించి వారి డేటాని కొంతమంది అసాంఘికశక్తులకి అందజేస్తున్నారట. ఆ విధంగా 30000 మంది అమాయిలు కిడ్నాప్ కి గురయ్యి 14000 మంది తిరిగొస్తే మిగిలనవాళ్ల జాడ తెలియట్లేదట. 

ఇదేదో ఈ మధ్యనే చూసిన సినిమాలగ అనిపిస్తోందా? మీ ఆలోచన నిజమే. “కేరళ స్టోరీ” కథ ఇదే. అక్కడ కూడా 30000 మంది అమ్మాయిల లెక్కే. రీమేక్ చేయొచ్చు కానీ మరీ ఇంత దారుణంగా అంకెల్లో కూడా తేడా లేకుండానా పవన్ బాబు!!??

పైగా జనం ఏమంటున్నారంటే…ఒక నటి ఒంటరిగా ఉంటే ఆమె మీద కవిత్వాలు రాయడం (ఈ విషయం ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది…యూట్యూబులో ఉంది), భార్య పిల్లలు ఉండగా మరొక స్త్రీతో కాపురం చేసి పిల్లల్ని కని భార్యని ఏడిపించడం (ఇది కూడా ఆ భార్యే చెప్పింది), మరొక పంజాబీ కుటుంబానికి చెందిన తెలుగు నటి ఒంటరిగా ఉంటే ఆమెను ట్రాప్ చేయడం…ఇవన్నీ చేసిందెవరని అడుగుతున్నారు. ఒంటరి మహిళ్ల టార్గెట్ ఎవరిదో చెప్పమంటున్నారు. “పచ్చకామెర్ల వాడికి….” సామెత చెబుతున్నారు. 

వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వపరంగా కాకుండా వైకాపా పరంగా పనిచేస్తోందని, రానున్న ఎన్నికల్లో ఆ సేనని ఎదుర్కోవడం జనసేనకి, పసుపుసేనకి సాధ్యం కాదేమోనన్న భయంతో ఆ వ్యవస్థని డెమొనైజ్ చేసి, డీమోరలైజ్ చేసి దెబ్బతీయాలని ఎత్తుగడ వేసారు. ఇలా చేస్తే రాష్ట్రం మొత్తం అట్టుడికిపోయి జనం నుంచి తిరుగుబాటు వస్తుందని, వాలంటీర్ వీధిలో కనపడితే తరిమికొడతారని ఊహించాడు పిచ్చిమారాజు పవన్. 

ఇది సినిమా కాదు నాయనా!! నువ్వు అనుకున్నట్టు నడపడానికి!! బేసిక్ కామన్ సెన్స్ లేకుండా వాగేసావు. నీ అభియోగం నువ్వు తీసిన ఫ్లాప్ సినిమా “జానీ” లాంటిది…”గబ్బర్ సింగ్” అనుకోకు! 

నిజంగా 30000 మంది అమ్మాయిలు మిస్సైపోతే ఎంతమంది తల్లిదండ్రులు బయటికొచ్చి మీడియా ముందు తమ బాధ చెప్పుకున్నారు? ఇక్కడ చీమ చిటుక్కుమనలేదు కానీ ఢిల్లీల్లో నిఘా సంస్థ నీ చెవిలో చెప్పిందా? అసలు నువ్వు ఎవరివని? మంత్రివా?ఎంపీయావా? ఎమ్మెల్యేవా? కార్పొరేటర్ వా? వార్డ్ మెంబర్ వా? ఏదీ కాదు కదా! ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షుడివి…అయితే ఆ పార్టీనుంచి నువ్వు కూడా నెగ్గలేదు, నెగ్గిన ఒక్కడూ కూడా నీ వెనక లేడు. మరి దేశంలో ఎవ్వరూ లేనట్టు, ఏ వ్యవస్థా లేనట్టు సీటు-సింబలు లేని నీకు చెబుతుందా నిఘాసంస్థ? నమ్మించడానికైనా కనీస కామెన్ సెన్స్ ఉండాలి.

ఒక పక్కన చంద్రబాబు తాను మళ్లీ పవర్లోకొస్తే వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తానని చెప్తున్నాడు, అంతే తప్ప తన జన్మభూమి కమిటీలని మళ్లీ ప్రవేశపెడతానని చెప్పట్లేదు. ఆ కమిటీల వల్లే 2019లో ఘోర పరాజయం పాలయ్యామని స్వయంగా చంద్రబాబే పలు మీటింగుల్లో చెప్పాడు. ఎందుకంటే జన్మభూమి కమిటీలు జనాన్ని ఎలా పీడించుకుతిన్నాయో జనానికి తెలుసు, తెదేపా నాయకులకి తెలుసు, చంద్రబాబుకి తెలుసు. పార్టీమనుషులకి బాధ్యతలు అప్పజెప్తే వాళ్లు చేసేది అధికార దుర్వినియోగమే. అవే జన్మభూమి కమిటీలు. అలా కాకుండా ప్రజల్లో ఉన్న సామాన్య గృహిణులు, విద్య పూర్తయైనా తల్లిదండ్రుల ఆలనా పాలనా చూసుకుంటూ పల్లెల్లోనే ఉంటున్న యువతకి నెలకి రూ 5000 ఇస్తూ తలొక 50 ఇళ్లకి వాలంటీర్ గా నియమించడం జరిగింది. 

“నెలకి ఐదు వేలేనా? అది శ్రమ దోపిడి కాదా?” అంటున్నాడు పవన్. 20 రోజుల పనికి నిర్మాత నుంచి 50 కోట్లు దోపిడి చేసే నటుడికి వాలంటీర్లకి నెలకి ఎంతిస్తే శ్రమ దోపిడి కాకుండా ఉంటుందో చెప్పాలి. ఒకవేళ అటువంటి ఇబ్బంది ఉంటే ఈ పాటికే వాలంటీర్లు రోడ్డెక్కి జీతాలు పెంచమని ధర్నా చేసేవారు. కందకి లేని దురద కత్తిపీటకెందుకు? 

ఈ వాలంటీర్స్ లో సగం పైగా మహిళలు. రెండున్నర లక్షల మంది వాలంటీర్స్ మనోభావాల్ని దెబ్బ తీయడం వల్ల వాళ్లు పవన్ దిష్టిబొమ్మల్ని దగ్ధం చేస్తున్నారు, చెప్పులతో కొడుతున్నారు. పదే పదే వేదికలమీద నిలబడి చెప్పులు చూపిన దానికి ప్రతిఫలమన్నమాట ఇది. 

జగన్ ని కుర్చీలోంచి దింపాలని చేసే పనుల్లో ఇదొకటి. అప్పట్లో పంచాయితి ఎన్నికల ముందు దేవాలయాల మీద దాడులన్నారు. పంచాయతి ఎన్నికల్లో వైకాపా నెగ్గగానే అదేంటో దాడులు కూడా ఆగిపోయాయి. అంటే ఆ దాడులు ఎవరు చేయించినట్టు? 

ఇప్పుడు ఈ వాలంటీర్స్ ని వ్యభిచార బ్రోకర్లగా చిత్రీకరించడం… ఫలితంగా మళ్లీ ప్రతిపక్షాలు బొక్కబోర్లా పడడం ఖాయమనే అనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే మళ్లీ పవర్లోకొచ్చిన జగన్ ఏం చేస్తాడో అని భయపడుతున్నారేమో. జగనేమీ చెయ్యడు. పవనే మరింత కుళ్లుమోతుతనంతో మంచానపడతాడు. 

అప్పుడు జనం “అమ్మాయే సన్నగా” పాట బాణీలో ఇలా పాడుకోవచ్చు- 

జగనన్నే గెలవగా 
సీయమ్మే అవ్వగా 
మతితప్పి పవనేమో మంచానపడ్డాడే 

రాధాకుమారి. కె