వైసీపీ ‘సేవ్‌ అవర్‌ ఏపీ’ యాప్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉధృతంగా జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమ తీవ్రతను, ప్రజల ఆవేదనను, నిరసనలను ఎప్పటికప్పుడు ఫొటోలతో సహా నేరుగా గౌరవ రాష్ట్రపతిగారికి పంపే ‘సేవ్‌ అవర్‌ ఏపీ’ అనే మొబౌల్‌ యాండ్రాయిడ్‌ అప్లికేషన్‌ను వైఎస్‌ఆర్‌…

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉధృతంగా జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమ తీవ్రతను, ప్రజల ఆవేదనను, నిరసనలను ఎప్పటికప్పుడు ఫొటోలతో సహా నేరుగా గౌరవ రాష్ట్రపతిగారికి పంపే ‘సేవ్‌ అవర్‌ ఏపీ’ అనే మొబౌల్‌ యాండ్రాయిడ్‌ అప్లికేషన్‌ను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఐటీ విభాగం) ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు శ్రీమతి శోభా నాగిరెడ్డిగారు మరియు రాష్ట్ర ఐటీ కన్వీనర్‌ శ్రీ చల్లా మాధవరెడ్డిగారు ఈ అప్లికేషన్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీమతి శోభా నాగిరెడ్డిగారు మాట్లాడుతూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న కృషిలో భాగంగా ఐటీ విభాగం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని, అందుబాటులో వున్న ఆధునిక సమాచార సాంకేతికతను వినియోగించుకుని ప్రజల ఆకాంక్షను రాష్ట్రపతిగారికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఈ అప్లికేషన్‌ను ఐటి విభాగం తయారు చేసిందని తెలిపారు.

ఈ అప్లికేషన్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకుని మన రాష్ట్ర సమైక్యవాదులందరూ తమ తమ మొబైల్‌ సహాయంతో అప్‌లోడ్‌ చేసి ఇ-మెయిల్‌ ద్వారా ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియాకు పంపించవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ విభాగం రాష్ట్ర కన్వీనర్‌ చల్లా మధుసూధన్‌రెడ్డిగారితోపాటు కమిటీ సభ్యులు కిరణ్‌కుమార్‌, దేవరకొండ రమా ఫభాస్కర్‌, అబ్బవరం సురేంధ్ర, నారు మహేశ్వర్‌రెడ్డి, పోతుల శివ, ఆదిత్య, ప్రదీప్‌ మరియు రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.