ఇది యాంటీ వాలంటైన్స్ వీక్

పాత చేదు జ్ఞాపకాలన్నింటికీ మరిచిపోయి, లైఫ్ ను మరోసారి ఫ్రెష్ గా రీ-స్టార్ట్ చేయడం కోసం పెట్టిందే ఈ యాంటీ-వాలంటైన్స్ వీక్.

వాలంటైన్స్ డే పూర్తయింది. కిస్ డే, హగ్ డే, టెడ్డీ డే, చాక్లెట్ డే అంటూ వారం రోజుల పాటు ప్రేమికులు వాలంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే అన్ని ప్రేమలు సుఖాంతం అవ్వవు. అప్పటివరకు ప్రేమలో ఉన్న అబ్బాయిల్లో కొంతమంది, 14వ తేదీ నుంచి భగ్న ప్రేమికులుగా మారి ఉంటారు.

అలా లవ్ ఫెయిల్యూర్స్ గా మారిన కుర్రాళ్ల కోసమే 15వ తేదీ నుంచి యాంటీ-వాలంటైన్స్ వీక్ మొదలైంది. వాలంటైన్స్ వీక్ తరహాలోనే, యాంటీ-వాలంటైన్స్ వీక్ కూడా పాశ్చాత్య సంస్కృతి నుంచి వచ్చిందే. కాకపోతే ఈ కాలం కుర్రాళ్లకు ఇది బాగా పనికొస్తుంది.

యాంటీ వాలంటైన్స్ వీక్ లో 15వ తేదీ మొదటి రోజు. తమ ప్రేమను తిరస్కరించిన భాగస్వామిపై రాత్రంతా కోపం, చిరాకు, పగం పేరుకుపోయి ఉంటాయి. అలాంటి ఫీలింగ్స్ అన్నింటినీ మెల్లమెల్లగా వదిలేయాలి. దీనికి శ్లాప్ డే అని పేరు. కొంతమంది దీన్ని మువ్-ఆన్ డే అని కూడా అంటారు.

ఇక యాంటీ వాలంటైన్స్ వీక్ లో రెండో రోజును ‘కిక్ డే’ అని పిలుస్తారు. నెగెటివ్ ఫీలింగ్స్, చెడు జ్ఞాపకాల్ని విడిచిపెట్టాలి. మూడో రోజు పెర్ఫ్యూమ్ డే. అంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి. కుదిరితే మన కోసం మనమే ఓ బహుమతి ఇచ్చుకోవాలి.

ఇక నాలుగో రోజును ఫ్లర్టింగ్ డే, ఐదో రోజును కన్ఫెషన్ డే, ఆరో రోజును మిస్సింగ్ డే అని పిలుస్తారు. ఇక కీలకమైన ఏడో రోజుకు బ్రేకప్ డే అని పెట్టారు. ఈ 6 రోజుల ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత, ఏడో రోజు, అంటే ఫిబ్రవరి 21న తమ మాజీ భాగస్వామికి శాశ్వతంగా బ్రేకప్ చెప్పడం అన్నమాట. దీంతో యాంటీ-వాలంటైన్ డే వీక్ పూర్తవుతుంది.

పాత చేదు జ్ఞాపకాలన్నింటికీ మరిచిపోయి, లైఫ్ ను మరోసారి ఫ్రెష్ గా రీ-స్టార్ట్ చేయడం కోసం పెట్టిందే ఈ యాంటీ-వాలంటైన్స్ వీక్. అయితే ఇదంతా వారం రోజుల్లో పూర్తయ్యే పనికాదు. ప్రాక్టీస్ చేస్తే 3 వారాల్లో ఏదైనా సాధ్యమే అంటున్నారు సైకాలజిస్టులు.

2 Replies to “ఇది యాంటీ వాలంటైన్స్ వీక్”

Comments are closed.