అప్పుడప్పుడూ విరాట్ కోహ్లీ ఫెయిలవుతుంటాడు. కారణాలేవైనా సరే, క్రికెట్‌లో ఇది చాలా మామూలు విషయం. జట్టులో కీలకమైన ఆటగాడు కదా, వరుసగా రెండు మూడు మ్యాచ్‌లు ఫెయిలయ్యాడంటే, ఇష్టంతోనే అయినా 'కోహ్లీ ఇలా చేయడమేంటి.?' అంటూ విసుక్కోవడం భారత క్రికెట్ అభిమానులకి మామూలే. అదే కోహ్లీ హిట్టయ్యాడంటే, మ్యాచ్ దుమ్మురేగిపోవాల్సిందే.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో మూడో వన్డేని టీమిండియా కైవసం చేసుకుంది. తొలి వన్డేలో విజయం సాధించి, రెండో వన్డేలో చతికిలపడ్డ టీమిండియా, మూడో వన్డేలో విజయం సాధించడంతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియాకి 2-1 ఆధిక్యం దక్కింది న్యూజిలాండ్‌పైన. ఈ మ్యాచ్‌లో విశేషమేంటంటే, ధోనీ దుమ్మురేపాడు.. కోహ్లీ చెలరేగిపోయాడు. ధోనీని ఇంత జోరుతో చాన్నాళ్ళ తర్వాత చూశామని చెప్పక తప్పదు.
కోహ్లీ ఛేజింగ్‌లో స్టడీ అయినట్లు కన్పించాడో, ఇక చెలరేగిపోవడం ఖాయమని అభిమానులు ఫిక్సయిపోతారు. ఇప్పుడూ అదే జరిగింది. 30 పరుగుల వద్దే భారత క్రికెట్ అభిమానులు ఓ అంచనాకి వచ్చారు, కోహ్లీ మ్యాచ్‌ని గెలిపించేస్తాడని. ఛేజింగ్‌లో అదేంటో, కోహ్లీ చెలరేగిపోయే తీరు చాలా చిత్రంగా వుంటుంది. ప్రత్యర్థులకు ఇక ఛాన్సే వుండదు. 'ఛేజింగ్‌లో ఆడటమంటే అదో సరదా.. అందులోనూ ఒత్తిడిలో వున్నప్పుడు కొత్త ఉత్సాహం వచ్చేస్తుంటుంది.. అప్పుడప్పుడూ అది అత్యుత్సాహమైపోయి, తేడా కొట్టేస్తుందేమో నేను చెప్పలేను.. కానీ నా బెస్ట్ థింగ్స్ ఎక్కువగా ఛేజింగ్‌లోనే వుంటాయి..' అంటుంటాడు కోహ్లీ.
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలోనూ అదే జరిగింది. సెంచరీ కాదు, 150 పరుగులు దాటేశాడు. మ్యాచ్‌ని గెలిపించేశాడు. దటీజ్ కోహ్లీ.