రెండు రోజుల్లోపే ముగిసిన మ్యాచ్.. టెస్టు క్రికెట్ హిస్ట‌రీలోనే!

ఇండియా, ఇంగ్లండ్ ల మ‌ధ్య‌న జ‌రుగుతున్న టెస్టు సీరిస్ లో ఒక అరుదైన ఘ‌ట్టం చోటు చేసుకుంది. న‌రేంద్ర‌మోడీ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన మూడో టెస్టు మ్యాచ్ రెండంటే రెండు రోజుల్లోనే ముగిసింది. ప‌డిన…

ఇండియా, ఇంగ్లండ్ ల మ‌ధ్య‌న జ‌రుగుతున్న టెస్టు సీరిస్ లో ఒక అరుదైన ఘ‌ట్టం చోటు చేసుకుంది. న‌రేంద్ర‌మోడీ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన మూడో టెస్టు మ్యాచ్ రెండంటే రెండు రోజుల్లోనే ముగిసింది. ప‌డిన బంతుల ప్ర‌కారం.. అత్యంత చిట్టి టెస్టు మ్యాచ్ గా టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లోనే ప్ర‌త్యేకంగా నిలుస్తోంది ఈ డే అండ్ నైట్ టెస్టు.

క‌నీసం రెండు రోజులు పూర్తి కాకుండానే ఈ మ్యాచ్ ముగియ‌డం గ‌మ‌నార్హం. ఇసుక కుప్ప‌లాంటి పిచ్ మీద జ‌రిగిన ఈ మ్యాచ్ లో బ్యాట్స్ మెన్ కాసేపు ఆడ‌టానికి కూడా చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జ‌ట్టు తొలి ఇన్నింగ్స్ లో 112 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. 50 ఓవ‌ర్ల పాటు కూడా ఇంగ్లండ్ బ్యాటింగ్ చేయ‌లేక‌పోయింది.

ఇక భారత బ్యాట్స్ మెన్ కూడా ఈ పిచ్ మీద చేయ‌గలిగింది ఏమీ లేక‌పోయింది. రోహిత్ శ‌ర్మ మిన‌హాయిస్తే ఎవ్వ‌రూ అంత చెప్పుకోద‌గిన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయారు. అయితే ఇండియా తొలి ఇన్నింగ్స్ లో క‌నీసం 53 ఓవ‌ర్ల పాటు బ్యాటింగ్ చేయ‌గ‌లిగింది. 

ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జ‌ట్టు కేవ‌లం 30 ఓవ‌ర్ల‌కే ఆలౌట్ అయ్యింది. 81 ప‌రుగులు చేసి ఆ జ‌ట్టు రెండో ఇన్నింగ్స్ ముగించింది. 49 ప‌రుగులు ల‌క్ష్యాన్ని మాత్రం భార‌త జ‌ట్టు వికెట్ కోల్పోకుండా చేధించి మ్యాచ్ ను రెండో రోజే ముగించింది. 

మొత్తంగా 140 ఓవ‌ర్లు కూడా అవ‌స‌రం ప‌డ‌లేదు ఈ మ్యాచ్ ముగియ‌డానికి. బంతుల ప్ర‌కారం చూసుకుంటే.. ఇది టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లోనే అతి షార్ట్ టెస్ట్. ఈ మ్యాచ్ లో ప‌డ్డ మొత్తం బంతుల సంఖ్య 842.  ఎప్పుడో 1945-46 సీజ‌న్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ల మ‌ధ్య‌న వెల్లింగ్టన్ లో జ‌రిగిన ఒక టెస్టు మ్యాచ్ 872 బంతులకే పూర్త‌య్యింద‌ట‌. ఆ రికార్డును కూడా ఈ మ్యాచ్ స‌వ‌రించింది.

ఈ సినిమా అడ‌క‌పోతే ప్రొడ్యూస‌ర్ల‌కు హ‌ర్ర‌రే

ఓడిపోయే సరికి కుప్పం గుర్తుకు వచ్చిందా