ప్రస్తుతానికి మౌనమే నాభాష-క్రిష్

ఇది లాక్ డౌన్ టైమ్…కొందరికి ఇబ్బంది కావచ్చు. కానీ కొంత మందికి ఇది ఓ మంచి సదవకాశం. ముఖ్యంగా క్రియేటివ్ పీపుల్ కి. సినిమా దర్శకులు ఫుల్ గా ఇప్పుడు తమ తమ వ్యాపకాల్లో…

ఇది లాక్ డౌన్ టైమ్…కొందరికి ఇబ్బంది కావచ్చు. కానీ కొంత మందికి ఇది ఓ మంచి సదవకాశం. ముఖ్యంగా క్రియేటివ్ పీపుల్ కి. సినిమా దర్శకులు ఫుల్ గా ఇప్పుడు తమ తమ వ్యాపకాల్లో మునిగిపోయారు. కొత్త అయిడియాలకు పదును పెడుతున్నారు. కొత్త స్క్రిప్ట్ లు తయారు చేసుకుంటున్నారు. అలాంటి దర్శకులను పలకరిస్తే…

దర్ళకుడు క్రిష్ మితభాషి. అలా అని ఆయన దగ్గర విషయాలు వుండవా అంటే, తప్పులో కాలేసినట్లే. ఆయన మౌనంగా వుండే సముద్రం టైపు. అయినా కరోనా టైమ్ లో ఏం చేస్తున్నారో? ఓసారి అడగాల్సిందేగా.

-సార్ కరోనా ఇచ్చిన లాక్ డౌన్ టైమ్ లో ఏం చేస్తున్నారు.

ఇంటర్వూగా ఏమీ వద్దు..లాక్ డౌన్ అయిపోయాక, ఇద్దరం కాఫీకి కూర్చుని బోలెడు సోపు, బోలెడు సంగతులు మాట్లాడుకుందాం.

-అది సరేనండీ, మీ పవన్ కళ్యాణ్ సినిమా గురించి కాదు, ఆ సినిమా సంగతులు మీరేమీ చెప్పేయవద్దు కానీ, అసలు ఖాళీ టైమ్ ను మీరు ఎలా వాడుతున్నారా? అని.

సినిమాలు చూస్తున్నాను. పుస్తకాలు చదువుతున్నాను. నా దగ్గర మంచి లైబ్రరీ వుంది. ఇంకా వెబ్ సిరీస్ లు ప్లానింగ్ లో వున్నాయి. వాటి పనులు కూడా.

-మస్తీ వెబ్ సిరీస్ కు ఆదరణ ఎలా వుంది?

బాగుంది. మరికొన్ని కూడా ప్లానింగ్ లో వున్నాయి.

-ఇవి కూడా ఆహా యాప్ లోనేనా? 

కాదు..వేరే వేరే ఓటిటి సంస్థలకు.

-ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ లకు మంచి టైమ్ వచ్చిందంటారా? అనుకోకుండా, అయాచితంగా జనాలకు దగ్గరయ్యే చాన్స్ వచ్చినట్లేనా?

చెప్పాగా..నేను ఏదీ మాట్లాడను. మీతో అని కాదు. కొన్ని కారణాల వల్ల 2021 వరకు ఏమీ మాట్లాడను. 

-ఏంటి సర్..అంత తీవ్ర నిర్ణయం

అంతే. అంతకన్నా ఏం చెప్పను. ఇంటర్వ్యూగా అంటే వద్దు. పర్సనల్ గా కూర్చుందాం, ఎంత సేపు అయినా మాట్లాడుకుందాం.

-సరే వదిలేయండి..కరోనా టైమ్ ఫుల్ గా వాడేసుకుంటూ, మరిన్ని మంచి వెబ్ సిరీస్ లు, సినిమాలు మీ నుంచి వచ్చేస్తాయని, కోరుకుంటా.

థాంక్యూ..అర్థంచేసుకున్నందుకు.

-విఎస్ఎన్ మూర్తి