గజనీ దండయాత్రల మాదిరిగా సినిమా మీద సినిమా చేస్తూ, విజయం కోసం వేటాడుతూనే వున్నాడు హీరో కిరణ్ అబ్బవరం. మంచి సబ్జెక్ట్ లు ఎంచుకుంటున్నాడు. కష్టపడతున్నాడు. తన పాత్రల విషయంలో కూడా రకరకాల ట్రయిల్స్ చేస్తున్నాడు. అయినా సరైన బ్రేక్ అనే సక్సెస్ దోబూచులాడుతూనే వుంది. ఈసారి మరో విభిన్నమైన ప్రయత్నం చేస్తున్నాడు. పీరియాడిక్ థ్రిల్లర్ ఒకటి ప్లాన్ చేసాడు.
ఈ జనరేషన్ ప్రేక్షకులు సమ్ థింగ్ డిఫరెంట్ గా వుంటే తప్ప సినిమా థియేటర్ కు రావడం లేదు. అలాగే డిజిటల్ అమ్మకాలు కూడా అలాంటి వాటికే వుంటున్నాయి. అందుకే ఈసారి అలాంటి సబ్జెక్ట్ నే తీసుకున్నాడు కిరణ్ అబ్బవరం. కాస్త భారీ బడ్జెట్ నే. ఈ సినిమాకు తన పేరులోని పొడి అక్షరాలనే టైటిల్ గా పెట్టుకున్నాడు. ‘క’. ఇదీ టైటిల్
ఇంగ్లీష్ లో KA అని వస్తుంది అంటే కిరణ్ అబ్బవరం అన్న మాట. అయితే ఇదే అక్షరాలకు వేరే అర్ధం వచ్చేలా ఏదో ప్లాన్ చేసే వుంటారు. పేరులో నేముంది అని అంటారు కానీ, ఆర్ఆర్ఆర్ దగ్గర నుంచి టైటిల్ కాస్త చిత్రంగా వుంటేనే సినిమా మీద ఆసక్తి వుండేది. ఆ తరువాత ఓపెనింగ్, క్వాలిటీ ప్రకారం సక్సెస్.అంతే కదా.