స్పీడ్..స్పీడ్..స్పీడ్..ఎవరు ముందు వార్తలు అందిస్తారా అన్నంత స్పీడ్. దాంతో నిజమో కాదో ధృవీకరణే జరగడం లేదు. నిన్న వెబ్ లో, ఈ రోజు ప్రింట్ లో కొన్ని ఫొటోలు దర్శనమిచ్చాయి. బాహుబలి కాన్సెప్ట్ పార్టీ జరిగిందని, రాజమౌళి, ప్రభాస్ రాలేదని, మిగిలిన వారు రకరకాల గెటప్ ల్లో వచ్చారన్నది దాని సారాంశం.
కానీ అసలు విషయం ఇవ్వాళ బయటకు వచ్చింది. అసలు పార్టీకి బాహుబలికి సంబంధం లేదట. ఆ పార్టీ ని నిర్మాత పివిపి హోస్ట్ చేసారు. ఎందుకోసం..తన సినిమా 'సైజ్ జీరో' దర్శకుడు కోవెలమూడి ప్రకాష్ (రాఘవేంద్రరావు తనయుడు) పుట్టిన రోజు సందర్భంగా. ఆయనతో సహా హాజరైన అందరూ డిఫరెంట్ కాన్సెప్ట్ లు, కాస్ట్యూమ్ ల్లో దానికి హాజరయ్యారు.
ఆ ఫొటోలు కోన్ని మొబైల్స్ తో తీసినవి, బయటకు వచ్చాయి. రానా, రమా రాజమౌళి, అనుష్క, రాఘవేంద్రరావు, ఇలా చాలా మంది బాహుబలితో కనెక్షన్ వున్నవారు వుండడంతో, ఈ పార్టీ ఆ సినిమాది అనుకున్నారు..అదే ప్రచారం జరిగిపోయింది.