Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అఖండ 'పావలా' కష్టాలు

అఖండ 'పావలా' కష్టాలు

ఆంధ్రలో టికెట్ రేట్లు తగ్గించడం బాలయ్య అఖండ సినిమా విడుదలకు అడ్డం పడుతోంది. సినిమా విడుదల డేట్ కు సమస్య లేదు. మార్కెటింగ్ కు సమస్య లేదు. కేవలం రేటుతోనే సమస్య. 

అఖండ సినిమాను చాన్నాళ్ల కిందటే ఆంధ్ర ఏరియాకు (సీడెడ్ లేకుండా) 35 కోట్ల రేషియోలో మార్కెట్ చేసేసారు. ఇనీషియల్ అగ్రిమెంట్లు అయిపోయాయి. కానీ కొత్త రేట్లు వస్తాయి అనుకున్నారు. రాలేదు. వస్తాయో, రావో తెలియదు. 

ఇప్పుడు విడుదల చేస్తాం అంటే బయ్యర్లు..ఆ రేటు కిట్టుబాటు కాదు అంటున్నారు. కనీసం 25 నుంచి 30 శాతం కట్ చేయమని అడుగుతున్నారు. అంటే 28 కోట్ల రేషియోలో విక్రయించాల్సి వస్తుందన్న మాట. 

ఆంధ్ర ఇలాగే తగ్గిస్తే సీడెడ్ కూడా తగ్గించాల్సిందే. అంటో టోటల్ గా దగ్గర దగ్గర ఓ పది కోట్లు ఆదాయం పోతుంది సినిమాకు. దీనికి నిర్మాత ఒప్పుకోవడం లేదు. ఆయన బాధ ఆయనది. దర్శకుడు బోయపాటి సినిమాకు మామూలుగా ఖర్చుచేయించలేదు. 

నాన్ థియేటర్ అమౌంట్ గట్టిగానే వచ్చినా కూడా థియేటర్ మీద యాభై కోట్లకు పైగా బర్డెన్ వుండిపోయేంత ఖర్చు చేయించారని టాక్. అసలే బోయపాటి గత సినిమాలతో దెబ్బ తిని వున్నారు నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి.

ఈ సినిమాతో రికవరీ అవుతారు అనుకుంటే ఈ సమస్య వచ్చి పడింది. దీంతో మీటింగ్ ల మీటింగ్ లు, డిస్కషన్ల మీద డిస్కషన్లు సాగుతున్నాయి. అవి ఒక కొలిక్కి వస్తే తప్ప, విడుదల తేదీ అనౌన్స్ మెంట్ రాకపోవచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?