అల్లు అర్జున్‌తో ఛాన్స్‌ కొట్టేసింది

‘ఒక లైలా కోసం’తో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చిన పూజా హెగ్డేకి తొలి సినిమాతోనే గుర్తింపు వచ్చింది. లేటెస్ట్‌గా వచ్చిన ‘ముకుంద’లో కూడా పూజ ఇంప్రెస్‌ చేసింది. ఆమెకి ఆల్రెడీ ఇక్కడ ఫాన్‌ బేస్‌…

‘ఒక లైలా కోసం’తో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చిన పూజా హెగ్డేకి తొలి సినిమాతోనే గుర్తింపు వచ్చింది. లేటెస్ట్‌గా వచ్చిన ‘ముకుంద’లో కూడా పూజ ఇంప్రెస్‌ చేసింది. ఆమెకి ఆల్రెడీ ఇక్కడ ఫాన్‌ బేస్‌ బాగా బిల్డ్‌ అయింది. ఇంకా పెద్ద విజయం తన ఖాతాలో లేదనేది తప్పిస్తే పూజ పెద్ద ఆఫర్లు దక్కించుకుంటోంది. హిందీలో హృతిక్‌రోషన్‌తో ‘మొహంజుదారో’లో నటిస్తోన్న పూజ త్వరలో అల్లు అర్జున్‌తో నటించనుందట. 

అల్లు అర్జున్‌ హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందే చిత్రంలో పూజ హీరోయిన్‌గా నటిస్తుందని వినిపిస్తోంది. ఈ చిత్రం సెట్స్‌ మీదకి వెళ్లడానికి ఇంకా చాలా టైముంది. అయితే ముందుగా పూజ డేట్స్‌ని సదరు నిర్మాత బ్లాక్‌ చేసి పెట్టారని న్యూస్‌. ఎలాగో హృతిక్‌ సినిమా అయ్యే వరకు మరే చిత్రం చేయకూడదనే కండిషన్‌ ఆమెకుంది.

పూజ ఆ సినిమా పనులు పూర్తి చేసుకునే సరికి మళ్లీ వేరే వాళ్లు పోటీకి వచ్చేస్తారని ముందే ఆమె డేట్స్‌ బ్లాక్‌ చేసారన్నమాట. వరుణ్‌తేజ్‌ తర్వాత అల్లు అర్జున్‌తో నటిస్తే… ఇక మిగతా మెగా హీరోలతో కూడా ఆమెకి అవకాశాలు వచ్చే అవకాశాలే ఎక్కువ. అదే జరిగితే పూజ ఇక మిగిలిన స్టార్‌ హీరోలతో ఒక్కో సినిమా చేసేయడానికి ఆట్టే సమయం పట్టదన్నమాట.