మిర్చితో సంతూర్ మమ్మీగా, అత్తారింటికి దారేదితో యంగ్ ఆంటీగా పేరు తెచ్చకున్న నదియాకు వెంటనే చాన్స్ లు వెల్లువైపోలేదు కానీ, ఫరవాలేదు. లెజెండ్ లో బాలకృష్ణతో నటిస్తోందన్న వార్తలు వినవచ్చాయి. తాజాగా శ్రీను వైట్ల, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున 'ఆగడు'లో కూడా కీలకమైన పాత్రకు ఓకె అయిందట.
Advertisement
ఇదిలా వుంటే నదియాకు వెంటవెంటనే ఆఫర్లు రాకపోవడం వెనుక ఆమె రెమ్యూనిరేషన్ సమస్య అన్న వార్తలు వినవస్తున్నాయి. యాభైకి తక్కువైతే చేయనని ఆమె పట్టుదలగా వుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.