విష్ణు-వర్మ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అనుక్షణం. సినిమా పంపిణీ వ్యవస్థను కాదని, నేరుగా జనాల చేత కొనిపించి, థియేటర్లలో విడుదల చేయడానికి వర్మ కనిపెట్టిన కొత్త పద్దతిలో విడుదలవుతున్న తొలి సినిమా. ఇందుకోసం ఓ వెబ్ సైట్, బిడ్డింగ్,. ఇఎమ్ఐ వంటి నానా హంగామా ప్రారంభమైంది. దానికి స్పందన అమోఘంగా వుందని చెప్పడమూ అయింది.
అయితే…ఇప్పుడు ఇంతకీ ఈ సినిమా ముందుగా అనుకున్న తేదీకి (15వ తేదీ) విడుదలవుతుందా కాదా అన్నది అనుమానంగా వుంది. ఏ విషయమూ సోమవారం తెలుస్తుంది. ఇంకా బిడ్డింగ్ టైమ్ వుంది. అలా అని థియేటర్లు రెడీనా అంటే అదీ కాదు. కొన్ని థియేటర్లు ఓకె. మరి కొన్ని ఓకె కావాలి. తొలి ప్రయత్నం విజయవంతమై, కొన్నవాళ్లకి నాలుగు రూపాయిలు రాకున్నా, కనీసం పెట్టుబడి వెనక్కు రావాలి. అప్పుడే మరో ప్రాజెక్టుకు అవకాశం వుంటుంది. లేకుంటే కష్టం. అందుకే, ఆచి తూచి, సరైన సినిమా కాంపిటేషన్ లేనపుడు వదలాలని చూస్తున్నట్లుంది.