టాలీవుడ్లోనే కాదు.. యావత్ దక్షిణాదిలోనే నెంబర్ వన్ కథానాయిక అనుష్కనే. ఈ కిరీటం కట్టబెట్టడం వెనుక ఉన్న ప్రధాన మైన కారణం.. రుద్రమదేవి, వర్ణ సినిమాలు. ఈ రెండు సినిమాల బడ్జెట్ దాదాపు రూ. 100 కోట్లు. ఈ సినిమాల్లో అనుష్క మినహా పెద్ద ఆకర్షించే కమర్షియల్ వస్తువు లేదు. వ్యాపారం జరగాలంటే.. అనుష్క పేరుతోనే జరగాలి.
ఓ కథానాయికను నమ్మి చెరో రూ. 50 కోట్లు ఖర్చుపెట్టారంటే ఏమిటి అర్థం..? ఆ పెట్టుబడి తిరిగి తీసుకొచ్చే స్థాయి, దమ్ము అనుష్కలో ఉన్నాయనే కదా..? ఈ నమ్మకం కలిగించింది అరుంధతి సినిమానే. సినిమా బాగుండేలే గానీ.. అందులో కనిపించేది ఎవరైనా సరే.. రికార్డు వసూళ్లు దక్కించుకోవడం ఖాయం అనే నమ్మకాన్ని కలిగించిన చిత్రాలవి.
అందుకే ఇప్పుడు అనుష్కపై రూ. 50 కోట్లు పెట్టడానికి వెనుకంజ వేయడం లేదు. రామ్చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ – ఈ హీరోల మార్కెట్ రూ. 50 కోట్ల లోపే. అందులోనే సినిమాలు తీయాలి. అంటే.. అనుష్క రేంజు ఈ హీరోలతో సమానమనే కదా..? మరి ఈ నమ్మకాన్ని జేజమ్మ ఎంత వరకూ నిలబెట్టుకొంటుందో చూడాలి.