Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బోయపాటిని దిల్ రాజు ఆదుకుంటారా?

బోయపాటిని దిల్ రాజు ఆదుకుంటారా?

కథ రెడీ, హీరో రెడీ... కానీ సినిమా నిర్మించే నిర్మాత లేరు. అలా అని చిన్న సినిమా, చిన్న హీరో కాదు. బాలయ్య లాంటి పదికోట్ల హీరో, బోయపాటి లాంటి పదికోట్ల డైరక్టర్. కానీ నిర్మాతలు ఎవ్వరూ అంతగా ముందుకు రావడంలేదు. సాహసించడం లేదు. దీనికి ఒకటే కారణం.. సినిమా బడ్జెట్. 60 కోట్ల బడ్జెట్ చెబుతున్నారు బోయపాటి అని బోగట్టా. కానీ బోయపాటిని నమ్మలేం, మరో అయిదు, పది అటే అవుతుంది కానీ ఇటు కాదు అన్నది ఇండస్ట్రీ టాక్.

బాలయ్య తన బ్యానర్ మీద తీసే ఆలోచనలో లేరు. మరెవరు ముందుకు రావడంలేదు. ఇలాంటి టైమ్ లో ఈ ప్రాజెక్టు టేకప్ చేస్తే ఎలా వుంటుంది? లాభమా? నష్టమా? అన్న ఆలోచనలు చేస్తున్నారట నిర్మాత దిల్ రాజు. వాస్తవానికి యాభై కోట్లలో బోయపాటి చేస్తానంటే చేయడానికి నిర్మాతలు వున్నారు. అరవై అనేసరికే తేడా వస్తోంది. మరి దిల్ రాజు కూడా యాభైకి దిగమని అంటారా? ఆయన లెక్కలు ఆయనకు వుంటాయి కనుక అరవైకి సాహసించి బోయపాటితో ముందుకు వెళ్తారా?

అయితే ఇదంతా ఇంకా జస్ట్ ఆలోచన రేంజ్ లోనే వుంది. దిల్ రాజు కు లెక్కలు సెట్ కావాలి. భరోసా కుదరాలి. అప్పుడు ముందుకు వెళ్తుందేమో?

పరిటాల శ్రీరామ్..చలో సింగపూర్ అంటారా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?