అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం బోయపాటికి ఏకంగా 12 కోట్ల రూపాయలు ఇవ్వడానికి నాగ్ ముందుకొచ్చినట్టు టాక్.
అయితే అంతా అనుకుంటున్నట్టు నాగచైతన్య హీరోగా ఈ సినిమా చేయడం లేదట నాగ్. బోయపాటి డైరక్షన్ లో అఖిల్ ను సెట్ చేయాలని చూస్తున్నాడట.
అఖిల్ కు మాస్ ఇమేజ్ తీసుకొచ్చేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడు నాగార్జున. మొదటి సినిమాలో అలాంటి ఎలిమెంట్స్ బాగానే కనిపిస్తాయి. కానీ అది వర్కవుట్ కాలేదు.
ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో కూడా యాక్షన్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయని టాక్. వీటి కోసం ఏకంగా 12 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇక మూడో సినిమాగా బోయపాటి-అఖిల్ కాంబోను సెట్ చేస్తే బాగుంటుందని నాగ్ భావిస్తున్నాడట.
బోయపాటికి నాగచైతన్యను అప్పగించడం ఈ టైమ్ లో సరైన నిర్ణయం కాదని భావిస్తున్నాడు నాగ్. ఎందుకంటే కూల్, రొమాంటిక్ ఇమేజ్ తో మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకున్నాడు చైతూ. తాజాగా రారండోయ్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.
ఇలాంటి టైమ్ లో బోయపాటి దర్శకత్వంలో నాగచైతన్యను హీరోగా పెట్టి మరోసారి మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించడం మంచి పని కాదని నాగ్ భావిస్తున్నాడట. అందుకే అఖిల్ కోసం బోయపాటిని రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.