పాపం…చిరకాలంగా సరైన హిట్ లేక పోవచ్చు..స్వంత కథలు ఎన్నో తెరకెక్కించిన దాసరి ఇప్పుడు రీమేక్ ను నమ్ముకని రంగంలోకి దిగివుంటే వుండొచ్చు. కానీ అంతమాత్రం చేత మరీ ఈకాలం దర్శకుడితో పోలిస్తే ఇగో హర్టవదా.అదే జరిగింది.
దాసరి మీడియాతో మాట్లాడుతుంటే ఓ మీడియా మిత్రుడు..ఇన్నాళ్లు..పూరి జగన్నాథే వేగంగా సినిమాలు తీస్తారనుకంటే, మీరు కూడా అదే లైన్ లో పడ్డారు అన్న అర్థం వచ్చేలాంటి ప్రశ్న అడిగాడు. దాంతో దాసరి కి కాస్త ఇబ్బంది అనిపించింది..’ఏం అడుగుతున్నారు..ఆ రోజుల్లోనే 12రోజుల్లో నీడ తీసాను..ఇదేమీ కొత్త కాదు నాకు’ అనేటట్లు మాట్లడారట. పాపం మీడియా మిత్రుడు చిన్న బుచ్చుకున్నాడు.
నిజానికి ఇద్దరిదీ తప్పులేదు..కొత్త జెన్ తో సమానంగా సినిమా తీస్తున్నారని ఈయన అన్నాడు..ఈ జెన్ ఇప్పుడేమిటి ఎప్పుడో చేసి చూపించా అని ఆయన అన్నాడు. అంతా ఆటలో అరటిపండు వ్యవహారం.