దేవర 2 అతి పెద్ద అడ్డంకి?

చిక్కు ముడి వీడింది. ఎన్టీఅర్ పదే పదే ఇటీవల ఒకటికి రెండు సార్లు తన సోదరుడు కళ్యాణ్ రామ్ బంధువు, తనకు, తన బ్యానర్ కు కీలకమైన హరి గురించి ఇటీవల మాట్లాడారు. ఎవరు…

చిక్కు ముడి వీడింది. ఎన్టీఅర్ పదే పదే ఇటీవల ఒకటికి రెండు సార్లు తన సోదరుడు కళ్యాణ్ రామ్ బంధువు, తనకు, తన బ్యానర్ కు కీలకమైన హరి గురించి ఇటీవల మాట్లాడారు. ఎవరు ఏమనుకున్నా హరి తనకు, తన బ్రదర్ కు, తమ బ్యానర్ కు కీలకం అని ఎన్టీఅర్ కుండ బద్దలు కొట్టారు.

అసలు ఎన్టీఅర్ ఓపెన్ డయాస్ మీద ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని టాలీవుడ్ జ‌నాలు అంతా గుసగుసలు మొద‌లుపెట్టారు. మీరేమైనా అన్నారా.. నేనేం అనలేదే అనే సరదా మాటలు కూడా టాలీవుడ్ లో వినిపించాయి.

అయితే ఇప్పుడు దీనికి సంబంధించి అసలు సిసలు గ్యాసిప్ వినిపించడం ప్రారంభమైంది. నిర్మాణంలో హరి ప్రమేయం వుంటే తాను దేవర 2 సినిమా చేయడం కష్టమని నిర్మాత సుధాకర్ మిక్కిలినేని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఅర్ తో సినిమా అంటే ఎన్టీఅర్ అర్ట్స్ కలవాల్సి వుంటుంది. కలవడమే కాకుండా, నిర్మాణ బాధ్యతలు కూడా అప్పగించాల్సి వుంటుంది. గతంలో ఇదే విషయం మీద త్రివిక్రమ్- ఎన్టీఅర్ సినిమా కూడా అగిపోయిందనే గుసగుసలు వున్నాయి.

దేవర 2 సినిమాను 2025 అక్టోబర్ తరువాత స్టార్ట్ చేయాలన్నది ఎన్టీఅర్ అలోచనగా తెలుస్తోంది. కానీ నిర్మాత సుధాకర్ మాత్రం ఇలా అలోచిస్తున్నారనే గ్యాసిప్ బలంగా వినిపిస్తోంది. మరోపక్క సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పెట్టిన ఫ్రేమ్ ల మీద ఎన్టీఅర్ అసంతృప్తిగా వున్నారని, కనీసం ఈ విషయాన్ని దర్శకుడు కొరటాల శివ చూసుకోవాల్సి వుంది కదా అని అభిప్రాయపడుతున్నారని కూడా తెలుస్తోంది. అంటే అక్కడ కూడా దర్శకుడు- హీరో ఏకాభిప్రాయానికి రావాల్సి వుంది.

3 Replies to “దేవర 2 అతి పెద్ద అడ్డంకి?”

Comments are closed.