కొన్నిసార్లు రావడం లేటవుతుందిగానీ.. రావడం మాత్రం పక్కా అంటాడు గోపాల గోపాలలో పవన్ కల్యాణ్. గబ్బర్ సింగ్ 2 విషయంలోనూ ఇదే డైలాగ్ రిపీట్ చేస్తున్నాడు పవన్. రెండేళ్లుగా గబ్బర్ 2 సినిమా విషయంలో నిరీక్షణలో పెట్టేశాడు వవన్. సంపత్‌నంది స్థానంలో బాబి కూడా వచ్చాడు. అయినా సినిమా స్టార్ట్ అవ్వలేదు. దాంతో గబ్బర్ సింగ్ 2 ఉంటుందా, లేదా? అనే విషయంపై అనుమానాలు పెరిగిపోయాయి.
గబ్బర్ సింగ్ 2ని దాదాపుగా పక్కన పెట్టేశారని, ఈ సినిమా ఉండకపోవచ్చనే రూమర్లు వచ్చాయి. అయితే ఇవేం నిజం కావట. గబ్బర్ సింగ్ 2 పక్కాగా ఉంటుందని పవన్ కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాఎట్టిపరిస్థితుల్లోనూ మొదలవుతుందని, కాకపోతే.. కాస్త ఆలస్యం అవుతోందని పవన్ సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గబ్బర్ సింగ్ 2 తరవాతే పవన్ మిగిలిన ప్రాజెక్టులను సెట్స్‌పైకి తీసుకెళ్తాడట. ఏప్రిల్‌లో గబ్బర్ సింగ్ 2 సెట్స్‌పైకి వెళ్లే ఛాన్సుందని పవన్ సన్నిహితులు చెబుతున్నారు.