'మా' ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో తెరవెనుక మెగాస్టార్ చిరంజీవి వున్నారని, రాజేంద్రప్రసాద్ కు అండగా నిలిచారని తొలినాళ్లలోనే వార్తలు బయటకు వచ్చాయి. దాసరి సూచనతోనే మురళీమోహన్ కావాలని జయసుధను రంగంలోకి దింపారని, మెగాస్టార్ ను కాదని, రెండో సారి కూడా ప్రెస్ ముందుకు నాగబాబు రారని ఆ వార్తల అదనపు సమాచారం.
ఇప్పుడు అదే నిజమని తేలింది. మా ఎన్నికల్లో గెలిచిన రాజేంద్ర ప్రసాద్ టీమ్ తామే నేరుగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఆయన వారిని ఆహ్వానించి, అందరికీ శాలువలు కప్పి సత్కరించారు.
ఈ ఎన్నికలతో టాలీవుడ్ లో వున్న ప్రో తెలుగుదేశం గ్రూప్ లేదా యాంటీ మెగాస్టార్ గ్రూప్, అలాగే మెగాస్టార్ గ్రూప్ రెండు వున్నాయని స్పష్టమయింది. జయసుధ వర్గాన్ని మోహన్ బాబు, బాలకృష్ణ బహిరంగంగా సమర్థించిన సంగతి తెలిసిందే.