నాని-గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా జెర్సీ. హీరో నాని తొలిసారి రెమ్యూనిరేషన్ తీసుకోకుండా, బిజినెస్ లో షేర్ తీసుకుని చేసిన సినిమా ఇది. ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి మాంచి అప్లాజ్ వచ్చింది. అయితే డేట్ సరైనది సెట్ కాకపోవడం, అప్పటికే మజిలీ సినిమా కూడా క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో రావడంతో కొంత ఎఫెక్ట్ పడింది. ఆఖరికి ఒక్క సీడెడ్ మినహా మిగిలిన ఏరియాలు బ్రేక్ ఈవెన్ తో పాటు కమిషన్ దక్కించుకున్నాయి.
వాస్తవానికి ఈ సినిమాను చాలా తక్కువ రేట్లకు మార్కెట్ చేయడం అన్నది మంచిది అయింది. నాని క్రేజ్ చూపించి, ఎక్కువ రేట్లకు అమ్మివుంటే బయ్యర్లకు లాస్ ప్రాజెక్టు అయ్యేది. ఆంధ్ర అంతా కలిపి 9 కోట్లకు నైజాం 7 కోట్లకు, సీడెడ్ 3.60కి ఇచ్చారు. అయితే నాన్ థియేటర్ రైట్స్ బాగా రావడం వల్ల కలిసి వచ్చింది. నిర్మాతలకు కూడా ప్రాఫిటబుల్ వెంచర్ అయింది.
ఫైనల్ కలెక్షన్ల వివరాలు ఇలా వున్నాయి.
Nizam : 10.75 (7.00)
Ceded : 2.94 (3.60)
Vizag : 3.57 (2.50)
East : 2.04 (1.50)
West : 1.35 (1.12)
Guntur : 1.92 (1.60)
Krishna : 2.02 (1.50)
Nellore : 0.76 (0.74)