జ్యోతిలక్ష్మి సినిమా విడుదలయింది..ఆశించిన మేరకు ఫలితం ఇవ్వలేదు. ఆ సంగతి అలా వుంచితే, ఈ సినిమాకు నలుగురు కలిసి, నాలుగు కోట్లు పెట్టుబడి పెట్టారని ఇండస్ట్రీ టాక్. ఈ నలుగురిలో నిర్మాత సి కళ్యాణ్, దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్ చార్మి, మరో వ్యక్తి వున్నాడంటున్నారు.
ఎంత వస్తే అంతా సమానంగా పంచుకుందామని, ఎక్కువ వస్తే అప్పుడు చార్మికి, పూరికి పారితోషికాలు ఇవ్వాలని అనుకున్నారట. కానీ ఇప్పుడు అంతా కలిపి రెండు కోట్లు కూడా రిటర్న్ రాలేదని వినికిడి. దీంతో ఇక శాటిలైట్ మీదనే ఆశ పెట్టుకున్నారట.
మెసేజ్ ఓరింయంటెడ్ సినిమా, లేడీస్ సినిమా అంటే తప్ప శాటిలైట్ కాదు. అందుకే సభలు, సన్మానాలు అంటూ హడావుడి చేస్తున్నారన్నది ఇండస్ట్రీ గుసగుస. కనీసం రెండు కోట్లయినా శాటిలైట్ అయితే అప్పడు గట్టెక్కుతారు ఆ నలుగురు…