కన్నడ పూలరంగడు

సునీల్-వీరభ్రదమ్ చౌదరి కాంబినేషన్ లో వచ్చిన పూలరంగడు మాంచి కమర్షియల్ హిట్. ఇప్పుడా సినిమాను కన్నడంలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు చర్చలు ప్రారంభమయ్యాయి. బహశా మరోవారంలో  కొలిక్కి వస్తాయి. తెలుగులో…

సునీల్-వీరభ్రదమ్ చౌదరి కాంబినేషన్ లో వచ్చిన పూలరంగడు మాంచి కమర్షియల్ హిట్. ఇప్పుడా సినిమాను కన్నడంలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు చర్చలు ప్రారంభమయ్యాయి. బహశా మరోవారంలో  కొలిక్కి వస్తాయి. తెలుగులో సినిమా రూపొందించిన వీరభద్రమ్ చౌదరే కన్నడంలోనూ దర్శకుడిగా వుండారు. 

అంటే ఆ విధంగా చౌదరి కన్నడంలోకి ఎంట్రీ ఇస్తారన్నమాట. అల్లరి నరేష్ తో ఓ ప్రాజెక్ట్ చేసే ప్రయత్నంలో వున్నారు ఆయన. బహుశా అది అయిన తరువాతే కన్నడం ప్రాజెక్ట్ వుండొచ్చు. కన్నడంలో మీడియం రేంజ్ హీరో షరన్ కు ఈ సినిమా చూపించినట్లు తెలుస్తోంది. ఆయన ఓకె అంటే సినిమా పట్టాలెక్కినట్లే.