కత్తికి మళ్లీ కష్టాలు

పాపం, ఠాగూర్ మధు ఏ ముహుర్తంలో విజయ్-మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన కత్తి సినిమా హక్కులు కొన్నారో..విడుదలకు నోచుకోవడం లేదు. ముందు డబ్బింగ్ అన్నారు. తరువాత కాదు, సబ్జెక్ట్ బాగుంది పవన్ చేస్తే బాగుంటుంది…

పాపం, ఠాగూర్ మధు ఏ ముహుర్తంలో విజయ్-మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన కత్తి సినిమా హక్కులు కొన్నారో..విడుదలకు నోచుకోవడం లేదు. ముందు డబ్బింగ్ అన్నారు. తరువాత కాదు, సబ్జెక్ట్ బాగుంది పవన్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు. ఆయన ఓకె అనలేదని వార్తలు వినవచ్చాయి. అల్లు అర్జున్ కూడా ఇంట్రెస్టెడ్ అన్నారు. అదీ కాదని తేలిపోయింది. 

ఈలోగా సంక్రాంతి సీజన్ వచ్చేసింది.సరే ఫిబ్రవరిలో వదుల్తారేమో అనుకుంటే, ఇప్పుడు ఇంకో సమస్య వచ్చినట్లు వినికిడి. కత్తి సినిమా మూల కథ తానే అని నరసింహారావు అనే ఆయన చాంబర్ కు ఫిర్యాదు చేసినట్లు వినికిడి. తాను చాలా కాలం కిందట సూపర్ గుడ్ మూవీస్ ఆఫీసులో ఈ కథ చెప్పానని, అది అలా అలా మురుగదాస్ కు చేరి, కొన్ని మార్పులతో కత్తి సినిమాగా మారిందన్నది ఆయన వాదన. సూపర్ గుడ్ ఆఫీసులో విజయ్ కే కథ చెప్పారని కూడా ఓ వెర్షన్ వినిపిస్తోంది. 

ఏదయితేనేం, ఈ వివాదం రగిలి, ఆఖరికి పెద్దాయిన దాసరి దగ్గరకు వెళ్లడం, అక్కడి నుంచి చాంబర్ దృష్టికి చేరడం అయిపోయింది. నిన్నటికి నిన్న మురుగదాస్ ను కూడా చెన్నయ్ నుంచి పిలిపించారని, రోజల్లా పంచాయతీ అయిందని తెలుస్తోంది. ఔట్ కమ్ ఏమిటన్నది ఇంకా తెలియలేదు. అడ్డంకులన్నీ తొలగి కత్తి ఎప్పుడు విడుదల అవుతుందో మరి.