సాధారణంగా తెలుగు సినిమా జనాలు మా సినిమా కథ కొత్తగా వుంటుంది. ఇంత వరకు తెలుగు తెరపై రాని పాయింట్ చెప్పాం..లాంటి మాటలు మాట్లాడుతుంటారు. కానీ తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే, అందులో ఏమీ వుండదు విషయం. కానీ దర్శకుడు పూరి జగన్నాధ్ లేటెస్ట్ మూవీ లోఫర్ లో మాత్రం, చాలా రేర్ పాయింట్ ఒకటి వుంటుందని వినికిడి.
సినిమాకు ఈ పాయింట్ టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని బజ్ వినిపిస్తోంది. నిజానికి ఇలాంటి పాయింట్ టచ్ చేయాలంటే పూరి లాంటి దర్శకుడే తప్ప, మరొకరికి సాధ్యం కాదు. ఎందుకంటే..నేనింతే..నాఇష్టం టైపు దర్శకుడు ఆయన. సినిమాలో మదర్ సెంటిమెంట్.. ఆ సెంటి మెంట్ ప్రభావం చూపే ఈ పాయింట్.. ఆ తరువాత నడిచే లైన్ బాగా వచ్చిందని అంటున్నారు.
చూడాలి మరి బి సి సెంటర్లకు ఏ మేరకు నచ్చుతుందో? లోఫర్ గా వరుణ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 17న విడుదలవుతోంది.