మెగా క్యాంప్ లోనా? సాధ్యమేనా?

మూడు సినిమాలతో (13బి, ఇష్క్, మనం) తనేంటో ప్రూవ్ చేసుకున్న విక్రం కుమార్ కు ఇక ఆఫర్లు రావడం అన్నదానిలో వింతలేదు. కానీ విక్రం లాంటి దర్శకులు అన్ని క్యాంప్ ల్లోనూ ఇమడగలరా అన్నదే…

మూడు సినిమాలతో (13బి, ఇష్క్, మనం) తనేంటో ప్రూవ్ చేసుకున్న విక్రం కుమార్ కు ఇక ఆఫర్లు రావడం అన్నదానిలో వింతలేదు. కానీ విక్రం లాంటి దర్శకులు అన్ని క్యాంప్ ల్లోనూ ఇమడగలరా అన్నదే సందేహం. స్క్రిప్ట్ కు ఏడాది సమయం తీసుకుంటా అంటే నాగ్ కాబట్టి, స్టూడియోలో పెట్టి, ఓపిగ్గా నిరీక్షించాడు. 

అలాగే వీలయినంత వరకు స్క్రిప్ట్ల్ లో వేళ్లు, కాళ్లు పెట్టకుండా ఊరుకున్నాడు. కానీ  ఇప్పుడు మెగా క్యాంప్ నుంచి ఫోన్ వచ్చినట్లు గ్యాసిప్. 150 సినిమాకు సరియైన కథ కోసం చూస్తున్న చిరు ఫోన్ చేయడంలో ఆశ్చర్యం లేదు. 

కొడకుకుతో కలిసి నటించాలన్న కోరిక వుండొచ్చు. అయితే కానీ మెగా క్యాంప్ లో సినిమా అంటే దర్శకుడి కాళ్లు చేతులు కట్టేసి, తాము చెప్పినట్లు నడిపిస్తారని ఇండస్ట్రీ టాక్. అలాంటి చోట విక్రం లాంటి దర్శకుడు ఇమడగలడా? ఆశపెడి వెళ్లి, అభాసుకావడం మినహా మరేమైనా వుంటుందా?