మాటీవీ అవార్డుల్లో ఉత్తమ హీరో ఓటింగ్ కేటగిరీ అల్లు అర్జున్ కు దక్కింది. రేసుగుర్రం సినిమాకు. ఫిల్మ్ ఫేర్ కావచ్చు..టీఎస్ఆర్ కావచ్చు. అవార్డులు ఎక్కువగా పంపకాలే అని జనం అనుమానం. మనం సినిమాలో మాంచి పెర్ ఫార్మెన్స్ ఇచ్చిన సమంతను పక్కన పెట్టి ఫిల్మ్ ఫేర్ అవార్డును శృతిహాసన్ కు ఇచ్చారు. రేసుగుర్రం సినిమాలో శృతి అంత అద్భుతమైన నటన ఏం కనబర్చిందో జనానికే తెలియాలి.
ఇప్పుడు మాటీవీ ఉత్తమ యాక్టర్ ఓటింగ్ అవార్డు అల్లు అర్జున్ కు అదే రేసుగుర్రం సినిమాకు దక్కింది. కానీ బెస్ట్ ఎక్స్ ప్షనల్ పెర్ ఫార్మెన్స్ అవార్డు నాగ్ కు మనం సినిమాకు ఇచ్చారు. అలాగే మనం మ్యూజిక్ డైరక్టర్ అనూప్ కి, మనం సినిమాకు, అన్నీ నామినేటెడ్ అవార్డులే దక్కాయి. ఒక్క సమంతకు మాత్రమే ఓటింగ్ అవార్డు దక్కింది. దేవీశ్రీ ప్రసాద్, రేసుగుర్రం ఓటింగ్ అవార్డులను తన్నుకుపోయాయి. మహేష్ కు నేనొక్కడినే కు కూడా జ్యూరీ అవార్డే దక్కింది. అంటే ఓటింగ్ అవార్డులు మాత్రమే ప్రకటిస్తే, ఇటు నాగ్ కు, అటు మహేష్ కు అవార్డులు వుండేవి కావన్నమాట.
నిజానికి నాగ్ అద్భుతమైన నటన కనబర్చాడు మనం సినిమాలో. అందులో సందేహం లేదు. అలాగే మహేష్ కు కూడా సినిమా రిజల్ట్ ఎలా వున్నా మంచి నటన ప్రదర్శించాడు నేనొక్కడినే సినిమాలో. కానీ ఓటింగ్ జనాలకు ఈ రెండూ నచ్చలేదు. రేసుగుర్రంలో అల్లు అర్జున్ నటన మాత్రమే నచ్చింది.
అవును బెస్ట్ సెన్సేషనల్ అప్పీయరెన్స్ అంటూ కొత్త అవార్డు ఒకటి పుట్టించారు..దాన్ని మహేష్ కొడుకు గౌతమ్ కు ఇచ్చారు. నిజానికి ఈ అవార్డుకు ఆ కుర్రాడి కన్నా మనంలో అఖిల్ బెస్ట్ ఆఫ్ట్ అంటే కాదనగలమా? ఏమిటో ఈ అవార్డులు..పంపకాలు.