ఎప్పుడో నాలుగు నెలల క్రితమే మొదలవుతుందని అనుకున్న అక్కినేని అఖిల్ మొదటి సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్లలేదు. డైరెక్టర్ ఖరారైనా, సబ్జెక్ట్ ఓకే అయినా కూడా ఇంకా ఈ చిత్రం మొదలు కాలేదు. ఓ వైపు అఖిల్‌పై అంచనాలు పెంచేసుకుంటూ అభిమానులు అతని ఆగమనం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
నాగార్జున మాత్రం ఈ చిత్రం విషయంలో ఏ విధమైన కాంప్రమైజ్‌లు వద్దంటున్నాడు. కథతో వంద శాతం సంతృప్తి కలిగిన తర్వాతే షూటింగ్ అని తేల్చేసాడు. ఆయనకి ఈ సబ్జెక్ట్ విషయంలో ఇంకా కొన్ని డౌట్స్ ఉండడం వల్లే ఇంతవరకు మొదలు కాలేదట. నాగ చైతన్య తొలి సినిమా ఫ్లాప్ అయింది కనుకే అఖిల్ విషయంలో ఆ పొరపాటు జరగకుండా నాగ్ జాగ్రత్త పడుతున్నాడట.
ఇంకా సెట్స్ మీదకి వెళ్లలేదు కనుక ఈ చిత్రం వచ్చే ఏడాదిలో అయినా రిలీజ్ అవుతుందా లేక అఖిల్ ఎంట్రీ 2016 వరకు వాయిదా పడుతుందా అని అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. జనవరికల్లా షూటింగ్ స్టార్ట్ అయితే వచ్చే దసరాకి రిలీజ్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. లేదంటే 2016 సంక్రాంతి వరకు వేచి చూడక తప్పదు.